సమంత సూపరంతే

సమంత పెళ్లి అనగానే ఆమెతో సినిమాలు నిర్మిస్తోన్న నిర్మాతలకి కంగారు మొదలైంది. పెళ్లి పనులతో ఎన్నాళ్ల పాటు షూటింగ్స్‌కి దూరంగా వుంటుందో, మళ్లీ ఎప్పటికి పని మొదలు పెడుతుందోనని ఆందోళన పడ్డారు. కానీ పెళ్లికి…

సమంత పెళ్లి అనగానే ఆమెతో సినిమాలు నిర్మిస్తోన్న నిర్మాతలకి కంగారు మొదలైంది. పెళ్లి పనులతో ఎన్నాళ్ల పాటు షూటింగ్స్‌కి దూరంగా వుంటుందో, మళ్లీ ఎప్పటికి పని మొదలు పెడుతుందోనని ఆందోళన పడ్డారు. కానీ పెళ్లికి ముందొక వారం, తర్వాతొక వారం రోజుల సెలవులు మాత్రం తీసుకుని మళ్లీ సమంత పనిలో పడిపోయింది.

'రాజుగారి గది 2' ప్రమోషన్స్‌లో పాల్గొని ఆశ్చర్యపరిచిన సమంత 'మహానటి' షూటింగ్‌కి హాజరవుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా రూపొందుతోన్న 'రంగస్థలం 1985' కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటుందట. పెళ్లికి ముందే ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసాక కానీ సెలవు తీసుకోరాదని సమంత డిసైడయింది.

సమంత ప్రొఫెషినలిజం చూసి సినీ వర్గాల వారు తెగ మెచ్చుకుంటున్నారు. మరోవైపు నాగచైతన్య కూడా తను కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసాక గానీ హనీమూన్‌ హాలిడే తీసుకోరాదని ఫిక్స్‌ అయ్యాడట. నిర్మాతల శ్రేయస్సు కోరే ఈ జంటపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.