Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత చేతుల మీదుగా..

హీరో నాగ్ శౌర్య అంటే హీరోయిన్ సమంత అక్కినేనికి ప్రత్యేక అభిమానం. ఇద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు కూడా. ఆ పరిచయం, స్నేహంతోనే శౌర్య అంటే మంచి అభిమానం వుంది సమంతకు. ట్విట్టర్ లో కూడా స్పందిస్తుంటారు. ఇప్పుడు ఆ అభిమానంతోనే శౌర్య సినిమా టీజర్ ను సమంత లాంచ్ చేయబోతున్నారు.

శౌర్య కథ సమకూర్చి, స్వంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా 'అశ్వద్ధామ'. ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో 27న టీజర్ విడుదల చేయబోతున్నారు.

విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ గా అశ్వద్దామ సినిమాకు రూపకల్పన చేసారు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సమస్యను ఈ సినిమాలో చూపించారు. కేవలం థ్రిల్లర్ గా మాత్రమే కాకుండా, ఛేజ్ లు, ఫైట్ లు కూడా జోడించారు. 

కేజిఎఫ్ కు పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమాకు పనిచేయడం విశేషం. ఐరా క్రియేషన్స్ సంస్థ బ్యానర్ మీద ఉష ఈ సినిమాను నిర్మించారు.

ఆ విషయంలో సమంత నాకు ఇన్స్పిరేషన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?