సమంత ఈసారి ఎన్ని చూపిస్తుందో..?

చేనేత పేరుచెప్పి ఈమధ్య బాగానే ఎక్స్ పోజింగ్ చేసింది సమంత. ఓ మ్యాగజైన్ కు మొదట్లో ఇచ్చిన స్టిల్ అయితే పెద్ద సంచలనమే అయింది. దానికి కొనసాగింపుగా తాజాగా మరో 3 స్టిల్స్ కూడా…

చేనేత పేరుచెప్పి ఈమధ్య బాగానే ఎక్స్ పోజింగ్ చేసింది సమంత. ఓ మ్యాగజైన్ కు మొదట్లో ఇచ్చిన స్టిల్ అయితే పెద్ద సంచలనమే అయింది. దానికి కొనసాగింపుగా తాజాగా మరో 3 స్టిల్స్ కూడా విడుదలయ్యాయి. అవి కూడా ఉన్నంతలో హాట్ గానే ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు అదే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ సెక్స్ అంటే పడిచస్తానని, శృంగారం లేకుండా ఉండలేనని హాట్ కామెంట్స్ చేసింది. 

ఈ వ్యవహారాలతో సినిమాల కంటే ఎక్కువగా వార్తల్లో నలిగిన సమంత తాజాగా మరో సంచలనానికి సిద్ధమౌతోందనే చెప్పాలి. త్వరలోనే ఈ బ్యూటీ క్యాట్ వాక్ చేస్తుందట. చేనేత వస్త్రాలతో తయారుచేసిన డిజైన్లను ర్యాంప్ పై వయ్యారంగా ప్రదర్శిస్తుందట. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ తో వివాదాస్పదమైన సమంత.. ఇక ర్యాంప్ పై మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ ఈవెంట్ లో సమంత క్యాట్ వాక్ చేస్తుందట. చేనేత వస్త్రాలతో చేసిన మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ఆవిష్కరిస్తుందట. అన్నట్టు ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు మరింత మంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు.