మొన్న లీకులు.. ఈసారి అదే అఫీషియల్!

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు సంబంధించి మెల్లమెల్లగా ప్రచారం ఊపందుకుంటోంది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన మేకర్స్..…

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు సంబంధించి మెల్లమెల్లగా ప్రచారం ఊపందుకుంటోంది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన మేకర్స్.. త్వరలోనే మిగతా లుక్స్, సాంగ్స్ కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.

ఇందులో భాగంగా సమంత లుక్ ను విడుదల చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలో రంగస్థలం సినిమా నుంచి సమంత లుక్ ను విడుదల చేస్తారట. నిజానికి రంగస్థలం సినిమాకు సంబంధించి సమంత లుక్ ను ప్రత్యేకంగా విడుదల చేయనక్కర్లేదు. సినిమాలో ఆమె ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది చాలామందికి. దీనికి కారణం ఆమెకు సంబంధించిన స్టిల్స్ గతంలో లీక్ అవ్వడమే.

గేదెలు తోలుతూ ఓ స్టిల్, కట్టెల పొయ్యి ముందు వంట చేస్తూ మరో ఫొటో, మోటారులో ఆయిల్ పోస్తూ ఇంకో స్టిల్.. ఇలా సమంతకు సంబంధించి కొన్ని  స్టిల్స్ లీక్ అయ్యాయి. వీటిపై అప్పట్లో నిర్మాతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు అదే స్టిల్స్ ను ఫస్ట్ లుక్ కింద అఫీషియల్ గా విడుదల చేయాలనుకుంటున్నారట. ముందు ఓ కొత్త స్టిల్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత లీక్ అయిన స్టిల్స్ ను అఫీషియల్ గా రిలీజ్ చేస్తారట.

సుకుమార్ దర్శకత్వంలో 80లనాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను వాలంటైన్స్ డే రోజున విడుదల చేసే ఆలోచనలో కూడా యూనిట్ ఉంది. మార్చి 30న థియేటర్లలోకి రానుంది రంగస్థలం.