టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు సమంత. నేమ్ కు ఫేమ్ కు దేనికీ కొదవలేదు. ఆమె ఊ అనాలే కానీ సినిమాలకు కొదవలేదు. అయితే పెళ్లయిన దగ్గర నుంచి చాలా ఛూజీగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఆమెకు నచ్చింది కాబట్టే ఫ్యామిలీమన్ సిరీస్ లో లేడీ టెర్రరిస్ట్ గా నటిస్తోంది అలాంటి సమంత ఓ టాక్ షో చేయడానికి రెడీ అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు.
సాధారణంగా ఎక్కువ అవకాశాలు లేని వాళ్లు ఎంచుకునే మార్గం అది. ముఖ్యంగా తెలుగులో. దీన్ని బట్టి సమంతకు భారీ రెమ్యూనిరేషన్ ముట్టి వుంటుంది అనుకున్నారు చాలా మంది. అయితే తొలి ఎపిసోడ్ వచ్చింది.
ప్రతి ఒక్కరు ముక్త కంఠతో బాలేదు అని సర్టిఫై చేసేసారు. నందినీ రెడ్డి ఇంత అద్భుతం..అంత అద్భుతం అనేంతగా అల్లు అరవింద్ స్టేజ్ పై చెబితే జనం ఏమిటో అనుకున్నారు. తీరా చూస్తే అది ఓ కలగూరగంప మాదిరిగా వుంది.
సరే, ఇంతకీ ఈ సిరీస్ చేయడానికి సమంత రెమ్యూనిరేషన్ ఎంత? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం జస్ట్ కోటిన్నర. అది కూడా టోటల్ గా పది ఎపిసోడ్ లు చేయడానికి. అంటే ఒక్కో ఎపిసోడ్ కు 15లక్షలు మాత్రమే అన్నమాట. ఇంత తక్కువ రెమ్యూనిరేషన్ కు సమంత ఎందుకు ఓకె చేసినట్లు అన్న క్వశ్చన్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి.
దానికి సమాధానం ఒక్కటే. అల్లు అరవింద్ కు నాగార్జునకు వున్న అనుబంధం. అల్లు అరవింద్ సరైన టైమ్ లో నాగ్ చైతన్యతో ఓ సినిమా తీసారు. అఖిల్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అరవింద్ అడగగానే ఇంకే మాట్లాడకుండా సమంత ఓకె అన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే మొదటి ఎపిసోడ్ ఫీడ్ బ్యాక్ చూసిన తరువాత షో లో పలు మార్పులు చేయడానికి వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.