Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత- చైతన్య.. ఎస్ ఆర్ నో?

సమంత- చైతన్య.. ఎస్ ఆర్ నో?

టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న గ్యాసిప్ లు నిజమైతే,  నాగ్ చైతన్య విషయంలో నాగ్ ఒంటరి అయిపోతున్నారని అనుకోవాలి. కానీ అదేం లేదని, కొడుకులు అంటే నాగ్ కు అమిత ప్రేమ అని మొన్నటికి మొన్న జరిగిన సాహసం శ్వాసగా సాగిపో అడియో ఫంక్షన్ నిరూపించింది. నాగ్ మొదటి భార్య, వెంకటేష్ సోదరి నాగ చైతన్య తల్లి అన్న సంగతి తెలిసిందే. 

నాగ్.. చైతన్య-సమంత ప్రేమ వ్యవహారానికి అటు తల్లి వైపు వారంతా పచ్చ జెండా ఊపేసారని టాలీవుడ్ లో వదంతులు షికారు చేస్తున్నాయి. అంతే కాదు, సమంతను చైతన్య తల్లి చెన్నయ్ లోని తన ఇంటకి పిలిపించి, ఓ రోజు అంతా గడిపారని వార్తలు గుప్పుమన్నాయి. మరి నాగ్ మాటేమిటి?  చైతూ తల్లి అంటే ఇండస్ట్రీకి దూరంగా వున్నారు కాబట్టి ఆమె సమంత గురించి తెలుసుకుందామని పిలిపించి వుండొచ్చు. 

నాగ్ కు సమంత కొత్త ఏమీ కాదు. అందువల్ల కొత్తగా మాట్లాడేది ఏమీ వుండకపోవచ్చు..ఓకె అనడమా కాదా అన్నది ఒక్కటే మిగిలింది. నాగ్ వైపు నాగ్ మినహా ఎవరు లేరు. అమల ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు. చైతూకు దగ్గుబాటి వైపు పూర్తిగా మద్దతు లభిస్తున్నట్లే వుంది. అంటే ఇక నాగార్జున ఓకె అనడం లేదా ఈ విషయంలో తాను మౌనంగా వుండిపోవడం తప్ప వేరే ఆప్షన్ వున్నట్లు లేదు. 

అవును..ఇంతకీ ఇంత ఓపెన్ గా వాళ్ల పెళ్లి విషయంలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నా, చైతన్య..సమంత..నాగ్ ఎవరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం ఖండించడమూ లేదు. ఎవరు ఏమనుకుంటేనేం..మన మధ్య ఏమీ లేదని సమంత-చైతూ అనుకుంటున్నారా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?