సమంత…టూ క్లెవర్?

మొత్తానికి అక్కినేని ఫ్యామిలీకి భలే కోడలు దొరికేలా వుంది? పైగా ఆ ఫ్యామిలీ వ్యవహారాలకు క్వయిట్ అపోజిట్. అంతవరకు ఎందుకు అక్కినేని నాగ్ చైతన్యకే క్వయిట్ ఆపొజిట్. అక్కినేని ఫ్యామిలీ మొదట్నించీ గుంభనంగా వుంటూ…

మొత్తానికి అక్కినేని ఫ్యామిలీకి భలే కోడలు దొరికేలా వుంది? పైగా ఆ ఫ్యామిలీ వ్యవహారాలకు క్వయిట్ అపోజిట్. అంతవరకు ఎందుకు అక్కినేని నాగ్ చైతన్యకే క్వయిట్ ఆపొజిట్. అక్కినేని ఫ్యామిలీ మొదట్నించీ గుంభనంగా వుంటూ వస్తుంది. హడావుడి వుండదు. ఏదీ పైకి అంత సులువుగా వెల్లడించదు. ఫ్యామిలీలో విషయాలు ఫ్యామిలీలోనే వుంటాయి తప్ప బయటకు అంత సులువుగా రావు.

చైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం గురించి ఇంత రచ్చ రచ్చ జరుగుతోంది అయినా కూడా నాగ్ చైతన్య పెదవి విప్పాడా? కనీసం సన్నిహితుల దగ్గరయినా? అబ్బే. ఫేస్ బుక్ లోనో, ట్విట్టర్ లోనో పంచాయతీ పెట్టాడా? అబ్బే..అసలు ఈ వ్యవహారమే ఎలా బయటకు పొక్కింది? సమంత వల్లనే కదా ? ఆమెనే కదా ముందు సన్నాయి నొక్కులు మొదలు పెట్టింది. క్లారిటీగా కాదు, అవును అని ఏమయినా చెప్పిందా? లేదా పూర్తిగా చైతన్య మాదిరిగా మౌనంగా వుందా ? అబ్బే…తన మెంటార్ త్రివిక్రమ్ డైలాగ్ మాదిరిగా, చూపించీ చూపించనట్లు, కనిపించీ కనిపించనట్లు, వినిపించీ వినిపించనట్లు, ఈ వ్యవహారాన్ని బయటకు తోస్తూ వచ్చింది.

సరే, నాగ్ ఏదో ఒకటి చెప్పారు. విషయం అక్కడితో కాస్త ఆగింది. కానీ కొంచెం టైమ్ తీసుకునేసరికి మళ్లీ సమంత తన స్టయిల్ లో వత్తిడి స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేసింది. అడిగేజనాలు అలాంటి వారే..చెప్పే సమంత ది అలాంటి స్టయిలే. చైతన్య తనకు తానుగా సమంత పేరు చెప్పలేదు. నాగ్ కూడా చెప్పలేదు. కానీ అన్యాపదేశంగా సమంత ఈ డిస్కషన్ ను ఎందుకు కొనసాగిస్తున్నట్లో? అంటే పరోక్షంగా నాగ్ ఫ్యామిలీపై సమంత వత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది.

రాను రాను ఇంకెన్ని సిత్రాలు చూడాలో?