ఆ రెండు సినిమాలు ఒకటేనా?

ఇద్దరు దర్శకులు ఒకేసారి ఏదో విదేశీ సినిమా చూస్తారు. అందులో ఒక పాయింట్ వీళ్లకు కామన్ గా నచ్చుకుంది. దాని చుట్టూ కొత్తగా మరో కథ అల్లుకుంటారు. అలా ఒకే పాయింట్ తో వచ్చిన…

ఇద్దరు దర్శకులు ఒకేసారి ఏదో విదేశీ సినిమా చూస్తారు. అందులో ఒక పాయింట్ వీళ్లకు కామన్ గా నచ్చుకుంది. దాని చుట్టూ కొత్తగా మరో కథ అల్లుకుంటారు. అలా ఒకే పాయింట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఈమధ్య కాలంలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడిదే కోవలో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే బుర్రకథ, ఇస్మార్ట్ శంకర్.

ఆది నటించిన బుర్రకథ, రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో బేసిక్ స్టోరీ పాయింట్ దాదాపు ఒకేటే అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. బుర్రకథలో హీరోకు రెండు మెదళ్లు ఉంటాయి. ఎప్పుడు ఏ మెదడు పనిచేస్తే, ఆ వ్యక్తిలా మారిపోతుంటాడు హీరో. దాదాపు ఇదే పాయింట్ ను డబుల్ దిమాక్ గా మార్చి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను పూరి జగన్నాధ్ తీస్తున్నాడట.

బుర్రకథలో హీరో క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మేకర్స్ ఓపెన్ గా చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ విషయానికొచ్చేసరికి మాత్రం అసలు మేటర్ దాచేస్తున్నారు. హీరో మాస్ లుక్, అతడి తెలంగాణ యాసను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారు.

కానీ ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అనే విషయం చాలామందికి తెలుసు. రిలీజ్ కు ముందు స్టోరీలైన్ ను దాచిపెట్టడం పూరికి కొత్తకాదు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. కానీ ఈ రెండు సినిమాల లైన్ మాత్రం దాదాపు ఒకటే అని టాక్.

బుర్రకథ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను వచ్చేనెల 18న విడుదల చేయబోతున్నారు. సో.. ఈ రెండు సినిమాల్లో ఏదైనా సారుప్యత ఉంటే మాత్రం అది దర్శకుడు పూరి జగన్నాధ్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. 

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా