టాలీవుడ్ లో సమ్మె విరమణకు చర్చలు హుషారుగా సాగుతున్నాయి. నిన్నటికి నిన్న చాలా వరకు ఫలప్రదం అయ్యాయని, విరమించారని అంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా ఎక్కడా ఏ ప్రకటన రాలేదు. మరొపక్క ఇప్పుడు దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో వున్న సినిమాలకు వెసులుబాటు ఇచ్చేందుకు ఓకె అన్నారని మరో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే నిన్న జరిగిన చర్చలో దర్శకులు తరపున త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ కూడా పాల్గొనడం విశేషం. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు, సమావేశాలకు త్రివిక్రమ్ దూరంగా వుంటారు. కానీ ఆయన నిన్న చాలా ఏక్టివ్ పార్ట్ తీసుకున్నారని వినికిడి. టాప్ డైరక్టర్ హొదా అందుకున్నాక ఆ మాత్రం చేయక తప్పదు మరి.