రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ చేసిన యువ దర్శకుడు సంపత్ నంది, ప్రస్తుతం రవితేజతో ‘బెంగాల్ టైగర్’ సినిమా చేస్తున్న విషయం విదితమే. వాస్తవానికి ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది, పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్`2’ సినిమా చేయాల్సి వుంది. ఏమయ్యిందో, ‘గబ్బర్‌సింగ్`2’ సినిమా సంపత్ నంది చేతుల్లోంచి జారిపోయింది.
అయినప్పటికీ, పవన్‌కళ్యాణ్‌తో సినిమా ఖచ్చితంగా చేస్తానంటున్నాడు సంపత్ నంది. అంతే కాదు, అవకాశమిస్తే మెగాస్టార్‌తోనూ సినిమా చేయడానికి తాను సిద్ధమని చెప్పుకొచ్చాడీ యువ దర్శకుడు. మరోపక్క, సంపత్ నందితో మళ్ళీ సినిమా చేయాలని అనుకుంటున్నాడట రామ్‌చరణ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
పవన్‌తో బంపర్ ఛాన్స్‌ని సంపత్ నంది వదిలేసుకున్నాడో, సంపత్ నందిని పవన్ కావాలనే ‘గబ్బర్‌సింగ్`2’ నుంచి తొలగించాడోగానీ.. సూపర్ ఛాన్స్ అయితే సంపత్ నంది మిస్సయ్యాడనే చెప్పాలి. అయితే ‘బెంగాల్ టైగర్’తో హిట్ కొట్టి తన టాలెంట్‌ని నిరూపించుకోవాలనుకుంటున్న సంపత్ నందికి, ఆ సినిమా సూపర్ సక్సెస్ వస్తే, మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలైతే లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!