Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంగీత గ్రాండ్ రీఎంట్రీ

సంగీత గ్రాండ్ రీఎంట్రీ

శివపుత్రుడు, పెళ్లయిన కొత్తలో, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి లాంటి సినిమాల్లో నటించి, పెళ్లి చేసుకుని, తెలుగు సినిమా ప్రేక్షకులకు దూరమైన హీరోయిన్ సంగీత. ఇప్పుడు అదే సంగీత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. తమిళ సినిమాల్లో యాక్టివ్ గా నటిస్తున్న సంగీత తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఎందుకో దూరమయ్యారు. ఆమెను ఏరికోరి ఓ మంచి పాత్రకు ఒప్పించి మరీ తెలుగులో రీఎంట్రీ చేయిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో సంగీత ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ రష్మికతో వుండే కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. తెలుగులో మాంచి క్యారెక్టర్ ఫిమేల్ ఆర్టిస్లుల కొరత వుంది. ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తుంటే ఇక అన్ని సినిమాల్లో వాళ్లే కనిపిస్తున్నారు. అందువల్ల సంగీతకు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని అనుకోవచ్చు.

సంగీతకు మాత్రమేకాదు, విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి వాళ్లను కూడా మళ్లీ మొహానికి రంగు వేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాకు నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?