దిగ్దర్శకుడు శంకర్ ఐ (మనోహరుడు) సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న వారు వున్నారు. ట్రయిలర్లు కలిగించిన అట్రాక్షన్ అలాంటిది. పైగా శంకర్ అభిమాన జనం కూడా అతగాడి సినిమా చూసి చాలా కాలమైపోయింది. అయితే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఐ పోస్టు ప్రొడక్షన్ పనులు అంత వేగిన తెవిలేలా కనిపించడం లేదు.
దీపావళికి వస్తుందనుకున్న సినిమా వాయిదా పడిపోయింది. పోనీ బిజినెస్ జరగలేదా అంటే భారీ లెక్కలతో తెలుగు బిజినెస్ అయ్యింది. తమిళం సంగతి చెప్పనక్కర్లేదు. అయితే టెక్నికల్ వర్క్ ఎక్కవ కావడంతో లేట్ కాక తప్పడం లేదట. సంక్రాంతి అన్నది తెలుగు, తమిళ జనాలకు సరైన సీజన్. అందువల్ల అప్పుడు తీసుకువద్దామని అనుకుంటున్నారట.
అయితే ఇలాంటి సినిమాకు సమ్మర్ సరైన సీజన్ అని భావిస్తున్నారట. సినిమా ఎలా వున్నా రెండు నుంచి నాలుగు వారాలు ఎలాగూ మంచి ఓపెనింగ్స్ వంటాయి కాబట్టి, ఫిబ్రవరి ఎండ్ లో తీసుకువస్తే, మార్చి ఎగ్జామ్స్ అయ్యాక కూడా సినిమా నిలిచి వుంటుందని మరో థాట్ అట. ఇప్పటికైతే ఫిబ్రవరిలో అంటున్నారు. చూడాలి మళ్లీ ఎన్ని మార్పులు వస్తాయో?