సరైన హీరో ముందు ఒంగినా లాభం వుంటుంది

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు అన్నారు పెద్దలు. ఒకటి రెండు సినిమాలు తీస్తే తప్ప, అక్కడ లోటు పాట్లు తెలిసి రావు. అలా తెలిసిన ఓ నిర్మాత అన్న మాటలు..భలేగా వున్నాయి. నిజంగా…

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు అన్నారు పెద్దలు. ఒకటి రెండు సినిమాలు తీస్తే తప్ప, అక్కడ లోటు పాట్లు తెలిసి రావు. అలా తెలిసిన ఓ నిర్మాత అన్న మాటలు..భలేగా వున్నాయి. నిజంగా చిన్న నిర్మాతలను ఆలోచింపచేసేలా వున్నాయి. 

చిన్న, మీడియం, పెద్ద హీరోలు వుంటారు. ఏ హీరోకైనా కేరవాన్ ఇవ్వాల్సిందే, అదనపు ఖర్చులు మామూలే..వంగి వంగి..బాబు..బాబు..అంటూ దండాలు మామూలే. బ్రాండెడ్ డ్రెస్ లు మామూలే..సినిమా షూటింగ్ మామూలే. కానీ మార్కెట్ వేరు..శాటిలైట్ వేరు..పెట్టుబడిపై వడ్డీ మామూలే.

అంతే కాదు చిన్న హీరోకి, మీడియం హీరోకి మార్కెటింగ్ పాట్లు నిర్మాత పడాలి. ఆ హీరో తెచ్చేదేమీ వుండదు. అదే పెద్దహీరో అంటే మార్కెట్ దానంతట అదే పరుగెట్టుకువస్తుంది. ఇక ఆ పాటి దానికి ఏదో పాట్లు పడి కాస్త అబౌమ్ మీడయం రేంజ్ హీరో తొ సినిమా తీసుకోవడం ఉత్తమం. చిన్న, మీడియం హీరోలతో సినిమా చేసి, మార్కెట్ చేసుకోవడానికి, శాటిలైట్ అమ్ముకోవడానికి నానా పాట్లు పడాలి. 

ఇదీ ఆ నిర్మాతకు కలిగిన జ్ఞానోదయం. కానీ ఆలోచింప చేసేవిగానే వున్నాయి. ఈ మాటలు. పైగా చానెళ్లు కూడా తెలివి మీరిపోయాయి. చిన్న సినిమా అయితే చూద్దాం విడుదల కానీండి..రివ్యూలు రానీండి..అయినా ఇఫ్పుడు మాకు బడ్జెట్ లేదు..ఇలాంటి మాటలు చెబుతున్నాయి. అదే పెద్ద సినిమా అయితే ఎదురు వెళ్లి కొంటున్నాయి. పైగా పెద్ద సినిమాలు వస్తే అదే నిర్మాత తన గొడవున్నో మురుగిపోతున్న చిన్న సినిమాలు కూడా కలిపి అంటగట్టగలుగుతున్నాడు. 

అందువల్ల చిన్న నిర్మాతలు కొన్నాళ్లు చేతులు ముుడుచుకు కూర్చోవడమో, లేదా ఇద్దరు ముగ్గురు చిన్న నిర్మాతలు కలిసి పెద్ద సినిమాలు చేసుకోవడమో ఉత్తమం గా కనిపిస్తోంది అంటున్నారు సదరు నిర్మాత.