శరత్ మరార్ మరో డబ్బింగ్ సినిమా

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత నిర్మాత శరత్ మరార్ డబ్బింగ్ సినిమాల మీద దృష్టి సారించినట్లుంది. విజయ్ సినిమా అదిరింది ఆయన తొలి ప్రయత్నం. ఇప్పుడు మరో సినిమాను తెలుగులో డబ్బింగ్ కు…

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత నిర్మాత శరత్ మరార్ డబ్బింగ్ సినిమాల మీద దృష్టి సారించినట్లుంది. విజయ్ సినిమా అదిరింది ఆయన తొలి ప్రయత్నం. ఇప్పుడు మరో సినిమాను తెలుగులో డబ్బింగ్ కు తీసుకున్నారు.

నయనతార కీలకపాత్రలో నిర్మించిన హీరోయిన్ ఓరింయెంటెడ్ సినిమా ఆరమ్ (మంచి నిర్ణయం)ను శరత్ తెలుగులోకి అందించబోతున్నారు. ఈ సినిమా ఈ నెలలోనే తమిళనాట విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

గోపీ నయనార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కలెక్టర్ గా నటించింది. ఓ చిన్న గ్రామంలో జరిగిన పరిణామాలు, రాజకీయాలు, మీడియా, అడ్డంకులు వగైరా విషయాలు అన్నీ ఈ సినిమాలో చర్చకు వస్తాయి.

అయితే ఈ సినిమాను మరి ఏ విధంగా ఆలోచించి శరత్ మరార్ కొన్నారో తెలియదు. ఎందుకంటే ఈ సినిమా మన బి సి సెంటర్ల జనాలను ఆకట్టుకునే అంత మాస్ సినిమా కాదు. అలా అని ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కూడా కాదు. ఏ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లను ఆకట్టుకునే సినిమా.

బహుశా తమిళ నిర్మాతల తరపున విడుదల చేసి పెట్టడమో, లేదా, నామినల్ ప్రైస్ కు తీసుకోవడమో జరిగి వుండాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టేంత హుషారైన సినిమా అయితే కాదని వినికిడి.