పండితులు భలేగా ప్రవచనాలు చెబుతుంటారు..ర అంటే.. ఇది.. మ.. అంటే ఇది.. అంటూ ఎవరికి వారు అర్థాలు తీస్తుంటారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కథను కొందరు ఔత్సాహికులు కొత్త అర్థం చెబుతున్నారు.
ఈ సినిమాలో విలన్ శరద్ ఖేల్కర్ ఏమో జగన్ అంట. ముఖేష్ రుషి ఏమో చంద్రబాబు నాయుడు అంట. కాజల్ సీమాంధ్ర అంట. శరద్ కేల్కర్ బారిన కాజల్ పడకుండా రక్షించడానికి ముఖేష్ రుషి పిలిస్తే పవన్ వచ్చాడంట.తీరా చేసి రక్షించడానికి పనికి వచ్చాడు కానీ కాజల్ ను (అంటే సీమాంధ్ర) చేపట్టడానికి కులం అడ్డం వస్తోందన్నాడట ముఖేష్ రుషి.
‘కాపు’ కాయడానికి పనికి వచ్చాను కానీ, (అధికారం) చేపట్టడానికి పనికిరానా అని పవన్ నిలదీసాడు.. ముఖేష్ రుషే మళ్లీ శరద్ బారిన పడుతుంటే, పవన్ వేడుకుని, కాజల్ ను అప్పగించి పక్కకు తప్పకున్నాడు. అంటే జగన్ బారి నుంచి మరోసారి సీమాంధ్రను కాపాడి, చంధ్రబాబు నుంచే రాష్ట్రాధికారాన్ని అందుకున్నాడు.. అని భాష్యం చెబుతున్నారు.
పవన్ స్వయంగా రాసిన కథ వెనుక వున్న కథ ఇదీ అని కొత్త అర్థాలు తీస్తున్నారు. కొత్త భాష్యం ఎలా వుందీ అంటే పండితులు అక్షరానికి ఓ అర్థం చెప్పినట్లు అతికినట్లే వుంది.