‘సరిలేరు’ కు రష్మికనే మైనస్ నా?

సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకోగానే జనం ముక్కు మీద వేలేసుకున్నారు. మహేష్ పక్కన ఈ అమ్మాయా? అన్న కామెంట్లు వినిపించాయి. కానీ అనిల్ రావిపూడి నమ్మకమో,…

సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకోగానే జనం ముక్కు మీద వేలేసుకున్నారు. మహేష్ పక్కన ఈ అమ్మాయా? అన్న కామెంట్లు వినిపించాయి. కానీ అనిల్ రావిపూడి నమ్మకమో, అతగాడి నిర్ణయం మీద మహేష్ నమ్మకమో, సినిమా అర్జెంట్ గా స్టార్ట్ చేయడానికి ఆమె తప్ప మరెవరు దొరకని పరిస్థితి కారణమో, మొత్తానికి రష్మికనే ఫిక్స్ అయింది.

సినిమా విడుదలకు ముందు అనిల్ రావిపూడి కూడా రష్మిక ఫ్యాక్టర్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. హి ఈజ్ సో క్యూట్..అనే హుక్ లైన్ బాగా పాపులర్ కావడం, ఆ పాటలో రష్మిక డ్యాన్స్ చూసి ఆయన కూడా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ సినిమా విడుదల అయిన తరువాత తెలిసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు రష్మిక ఎంత మైనస్ అయిందో. 

అల వైకుంఠపురములో సినిమాకు పూజా హెగ్డే ఎంత ప్లస్ అయిందో, సరిలేరు సినిమాకు రష్మిక అంత మైనస్ అయింది. ఇదే ఇప్పుడు సినిమా సర్కిళ్లలో టాక్. ఇదిలా వుంటే మహేష్ అతని ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే వున్నట్లు కనిపిస్తోంది. రష్మికను సినిమా పోస్ట్ రిలీజ్ ప్రచారానికి అంతగా వాడడం లేదు. ఆమె కన్నా సీనియర్ నటి విజయశాంతినే ఎక్కువగా కనిపిస్తున్నారు. 

శర్వా, నాని, విజయ్ లాంటి మిడిల్ రేంజ్ హీరోల పక్కన తప్ప రష్మిక పెద్ద హీరోల పక్కన సరిపోదు అన్న కామెంట్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. రష్మిక ఆ మధ్య డియర్ కామ్రేడ్ తో దారుణ పరాజయం చవిచూసింది. నితిన్ తో భీష్మ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.