Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'సరిలేరు' స్ట్రాటజీయే వేరు

'సరిలేరు' స్ట్రాటజీయే వేరు

సంక్రాంతి రేస్ లో వున్న రెండు సినిమాల్లో ఒకటైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రచారం విషయంలో ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ సినిమాలోని సామజవరగమన సాంగ్ వైరల్ అయిపోయింది. మరో పాట ఇంకో రెండు రోజుల్లో రాబోతోంది. కానీ అదే పోటీలో వున్న మహష్ బాబు సరిలేరు నీకెవ్వరు సంగతేమిటి?

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఓ సాంగ్ లాంటిది ఆరంభంలో వదిలారు. కానీ అది కాకుండా సినిమాలో అయిదు పాటలు వున్నాయి. మరేవీ ఎందుకు వదలడం లేదు. అసలు దీపావళికి మహేష్ ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్న ట్రీట్ ఏమిటి?

ప్రచారం విషయంలో అస్సలు గాభరా పడవద్దని, డిసెంబర్ మొదటివారం లో మొదలుపెట్టి నెలరోజులు ఊపిరి ఆడకుండా ప్రచారం సాగించాలన్నది సరిలేరు టీమ్ ప్లాన్ అని తెలుస్తోంది. వాస్తవానికి దేవీ ట్యూన్స్ అన్నీ ఇచ్చేసాడు. కానీ విడుదల మాత్రం ఇప్పడే కాదు.

జనాలు కొత్త పాట ఏదయితే దాన్నే పట్టుకుంటారు. ఇప్పటి నుంచీ పాటలు వదిలేస్తే, డిసెంబర్ వేళకు పాతబడిపోయే ప్రమాదం వుంది. అందుకే డిసెంబర్ దాకా పాటల హడావుడి చేయకూడదని సరిలేరు టీమ్ ఫిక్స్ అయిపోయింది.

పాటలు అన్నీ దేవీ చాలా ప్రత్యేకంగా సవాలుగా తీసుకుని చేస్తున్నట్లు బోగట్టా. మహర్షి పాటలు బాగానే చేసినా, ఫ్యాన్స్ నుంచి కాస్త ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు దేవీ. అందులో అటు థమన్ చేస్తున్న త్రివిక్రమ్ సినిమాతో పోటీ వుంది. అందుకే ప్రతి పాట ప్రత్యేకంగా భావించి, ట్యూన్స్, ఆయన తన స్టయిల్ ట్రాక్ లిరిక్స్ చేసి అందించేసాడని తెలుస్తోంది.

సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, తన తొలి టాప్ స్టార్ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని వర్క్ చేస్తున్నట్లు బోగట్టా. సినిమా టాకీ అంతా దాదాపు అయిపోయింది. మరో రెండు రోజుల్లో స్టార్ట్ అయ్యే పోలాచ్చి షెడ్యూలుతో ఫినిష్ అయిపోతుంది. కేవలం పాటలు మాత్రమే బకాయి వుంటాయి.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?