సూపర్ స్టార్ మహేష్-మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
వాస్తవానికి ఈ నెల 15న పాటతో స్టార్ట్ చేయాల్సి వుంది. కానీ యూనిట్ మొత్తం పోలాచ్చిలో వుండిపోవడంతో, కాస్త వెనక్కు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే పోలాచ్చిలో వున్న యూనిట్ పనిలో పనిగా అక్కడ కొంత పబ్లిసిటీ మెటీరియల్ కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ల పరిచయం కోసం ఒక్కో క్యారెక్టర్ మీద ఒక్కో విడియో తయారుచేసినట్లు బోగట్టా.
బాహుబలి, సాహో సినిమాలకు రకరకాలుగా క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేసారు. అదే విధంగా చిన్న చిన్న విడియోల ద్వారా పరిచయం చేసే కాన్సెప్ట్ ను ఏదో దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సరిలేరు సినిమాకు ఇంకా మూడు పాటలు చిత్రీకరించాల్సి వుంది. వీటిలో ఒకటి అయిటమ్ సాంగ్. ఈ అయిటమ్ సాంగ్, మరోసాంగ్ సెట్ వేసి చిత్రీకరిస్తారు. మూడో పాట మెలోడీ. అది మాత్రం విదేశాల్లో చిత్రీకరిస్తారు. దీంతో సినిమా వర్క్ పూర్తి అయిపోతుంది.