Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శర్వా సినిమా కోసం కోటి సెట్

శర్వా సినిమా కోసం కోటి సెట్

సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మాఫియా గ్యాంగ్ స్టర్ బయోపిక్ లాంటి సినిమా అని ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ సినిమాలో శర్వాకు రెండు షేడ్స్ కూడా వుంటాయి. ఈ సినిమాకు ఎప్పడో పూజ అయింది కానీ, శర్వా వేరే ప్రాజెక్టులో వుండడం వల్ల లేట్ అయింది.

మొత్తానికి ఈ సినిమా కోసం కోటి రూపాయలకు పైగా వ్యయంతో సెట్ వేసారు. అంటే సినిమా స్టార్టింగ్ ట్రబుల్స్ అన్నీ అధిగమించినట్లే. ఒక దశలో శర్వానంద్ అలిగారు కూడా. ఎందకుంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను సీరియస్ గా తీసుకోవడం లేదనిపించి. కానీ ఆ తరువాత అన్నీ చక్కబడ్డాయి.

కానీ ఇప్పుడు ఒక్కటే సమస్య. సుధీర్ వర్మ మార్కెట్ ఎంత? శర్వానంద్ మార్కెట్ ఎంత? ఖర్చు ఎంత అన్నది. సినిమా వ్యవహారం చూస్తుంటే ఇరవై కోట్ల పైగా ఖర్చయ్యేలా వుందని వినికిడి. మరి అంత మార్కెట్ వుందా? అందులో గ్యాంగ్ స్టర్, మాఫియా అంటే శర్వానంద్ లేడీ, ఫ్యామిలీ ఆడియన్స్ సంగతేమిటి? అన్నది పాయింట్. ఇక్కడ పైకి ఎన్ని చెప్పినా, లోపల లెక్కలు వేసుకోవాల్సిందే.

మారుతి-నాగ్ చైతన్య సినిమాకు 16నుంచి 18కోట్లు, సుధీర్ వర్మ-శర్వా సినిమాకు ఖర్చు ఇరవై పైనే అని అంచనా. చైతూ సినిమాకు హిందీ డబ్బింగ్, శాటిలైట్ కలిపి మూడుకు పైగా వస్తే, సుధీర్ వర్మ సినిమాకు రెండుకు పైగా వచ్చింది. అంటే అక్కడ ఓ కోటి డెఫిసిట్. మరి సినిమా పూర్తయిన తరువాత మార్కెట్ ఎలా వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?