శర్వా..నో ప్రమోషన్స్

సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయంటే చాలు, దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత భుజాన వేసుకుంటారు హీరోలు. గ్రూప్ ఇంటర్వూలు, ఇంటర్వూలు, మీడియా మీట్ లు, ఛానెల్ సిట్టింగ్ లు ఇలా ఓ వారం రోజులు…

సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయంటే చాలు, దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత భుజాన వేసుకుంటారు హీరోలు. గ్రూప్ ఇంటర్వూలు, ఇంటర్వూలు, మీడియా మీట్ లు, ఛానెల్ సిట్టింగ్ లు ఇలా ఓ వారం రోజులు ఫుల్ గా బిజీ అయిపోతారు. సినిమా మీద నమ్మకం ఎక్కువ వున్నా, లేదా సినిమాను ఎత్తాల్సిన అవసరం ఎక్కువ వున్నా ఇంకా ఎక్కువ చేస్తారు.

కానీ శర్వానంద్ మాత్రం ఈసారి ఎందుకో ఈ వ్యవహారానికి దూరంగా వున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'పడి పడి లేచె మనసు' ఘోరంగా నిరాశపర్చింది. దానికి విపరీతంగా ప్రమోషన్ చేసాడు. అలాగే రణరంగం కూడా నిరాశ పర్చింది. దానికి ఓ మోస్తరుగా ప్రమోషన్ చేసాడు. 

మరి ఈ రెండు వ్యవహారాలు దృష్టిలో పెట్టుకునో, లేక జాను సినిమా ఎలా వుంటుంది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది క్లారిటీ లేకనో, శర్వా ఆ సినిమా ప్రమోషన్లకు దూరంగా వున్నాడు. కేవలం రెండు ప్రీ రిలీజ్ మీట్ ల్లో మాత్రమే పాల్గొన్నాడు.  ప్రమోషన్ ప్లానింగ్ కు కూడా శర్వా దూరంగా వున్నట్లు తెలుస్తోంది

దీంతో దిల్ రాజు ముందుగా రంగంలోకి దిగారు. బుధవారం నుంచి సమంత రంగంలోకి వస్తున్నారు. శర్వా మాత్రం షూటింగ్ ల్లో బిజీగా వున్నారు. సినిమా బాగుంటే, అప్పుడు పోస్ట్ రీలీజ్ ప్రచారం చేద్దామనే ఐడియాలో శర్వా వున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దిల్ రాజు జాను హీరో శర్వాకు ప్రీ రిలీజ్ కాన్ఫిడెన్స్ కలిగించడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది