ఒక్కో హీరోకు ఒక మార్కెట్ అంటూ వుంటుంది. మన యంగ్ హీరోల మార్కెట్ జనరల్ గా ముఫై నుంచి ముఫై అయిదు కోట్లు వుంటుంది. రేర్ గా భయంకరమైన హిట్ లు వస్తే యాభైకి వెళ్తుంది. అందుకే యంగ్ హీరోల మీద ఇరవైకోట్ల వరకు పెట్టుబడి అన్నది సేఫ్. 25 వరకు కాస్త రిస్క్ అయినా ఓకె. అది దాటితే మాత్రం కాస్త కష్టమే.
శర్వానంద్ లేటెస్ట్ మూవీ పడి పడి లేచె మనసు సినిమాకు మఫై దాటి పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. వడ్డీలు, ఫబ్లిసిటీ అన్నీ లెక్కవేసుకుంటే దాదాపు ముఫై అయిదు నుంచి నలభైకి చేరిపోతోందని తెలుస్తోంది. సినిమాలో ఓ కీలక మలుపు సన్నివేశం కోసం భారీగా సెట్ వేయాల్సిరావడం, అలాగే కథలో రెండు విభిన్న భాగాలు వుండడం, ఫైట్ల కోసం, ఇలా రకరకాలుగా ఖర్చు పెరిగిపోయిందని తెలుస్తోంది.
హను రాఘవపూడి ఇంతకు ముందు చేసిన లై లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాకు కూడా 35 కోట్లకు పైగా ఖర్చుకావడం విశేషం. ఇప్పుడు ఈ లవ్ స్టోరీకి కూడా అంతే ఖర్చు అంటే ఆశ్చర్యమే. శర్వా, సాయిపల్లవి లాంటి స్టార్ కాస్ట్ వుంది కాబట్టి, నిర్మాత, బయ్యర్లు కాస్త ధైర్యంగా వున్నారు.
త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్