శాతకర్ణి ఫంక్షన్ కు 80 లక్షలు

గౌతమీ పుత్ర శాతకర్ణి అడియో ఫంక్షన్ కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న మార్పులు వుంటాయి కానీ, మొత్తానికి అడియో ఫంక్షన్ అయితే తిరుపతిలో పక్కా. ఈ ఫంక్షన్ ఈవెంట్ చేయడానికి ఎంపికైన జే…

గౌతమీ పుత్ర శాతకర్ణి అడియో ఫంక్షన్ కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న మార్పులు వుంటాయి కానీ, మొత్తానికి అడియో ఫంక్షన్ అయితే తిరుపతిలో పక్కా. ఈ ఫంక్షన్ ఈవెంట్ చేయడానికి ఎంపికైన జే మీడియా సంస్థ ఇందుకోసం సుమారు 80 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఫంక్షన్ చేసే అవకాశం ఇవ్వడం వరకే నిర్మాత పని. ఖర్చంతా ఈవెంట్ మేనేజ్ మెంట్ దే. మరి ఏ మేరకు రిటర్న్ వస్తుందన్నది చూడాలి. లైవ్ హక్కులు, స్పాట్ అడ్వర్ టైజ్ మెంట్లు, స్పాన్సర్ షిప్ ల ద్వారా చాలా వరకు కవర్ కావచ్చు. కాగా ఇదే సంస్థ ఇటీవల భారీగా ఖర్చు చేసి, విజయవాడలో వంగవీటి అడియో ఫంక్షన్ కూడా నిర్వహించింది. మరి ఇంతంత ఖర్చు చేసి, అడియో ఫంక్షన్ లు చేయడం అన్నది ఏ విధంగా కిట్టుబాటు అన్నది నిర్వాహకులకే తెలియాలి.

అయితే ఇటీవల నిర్వహించిన ధృవ అడియో పంక్షన్ ను మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. గీతా సంస్థే ఇందుకోసం నలభై లక్షలు ఖర్చు చేసింది. రాను రాను అడియో ఫంక్షన్ లు కూడా భారీ బడ్జెట్ సినిమాల మాదిరిగా తయారవుతున్నాయి.