శాతకర్ణి ప్రచారానికి భయపడ్డ ఖైదీ?

11న విడుదల కావాలనుకున్న ఖైదీ నెంబర్ 150 పోయి పోయి 13కు ఎందుకు ఫిక్సయింది? మామూలు జనాలకు ఈ విషయం పెద్దగా పట్టకపోయినా అభిమానుల్లో మాత్రం కాస్త డిస్కషన్ గానేవుంది. ఇంకా చెప్పాలంటే మెగాభిమానుల్లో…

11న విడుదల కావాలనుకున్న ఖైదీ నెంబర్ 150 పోయి పోయి 13కు ఎందుకు ఫిక్సయింది? మామూలు జనాలకు ఈ విషయం పెద్దగా పట్టకపోయినా అభిమానుల్లో మాత్రం కాస్త డిస్కషన్ గానేవుంది. ఇంకా చెప్పాలంటే మెగాభిమానుల్లో కాస్త ఇబ్బంది గా వుంది.

దాదాపు నెలా రెండునెలలుగా ఒకటే ప్రచారం. ఖైదీ సినిమా 11న వస్తే శాతకర్ణి 11న వస్తుంది. అదే కనుక వాళ్లు 13న వస్తే, శాతకర్ణి 12న వస్తుంది. ఇదీ ప్రచారం. ఇది అభిమానుల్లో బాగా సర్క్యులేట్ అయిన ప్రచారం. శాతకర్ణి యూనిట్ తరపున కూడా ఆఫ్ ది రికార్డుగా ఈ మాట కచ్చితంగా, బలంగా వినిపించింది. 

పోనీ డేట్ల గురించి రెండు యూనిట్ ల జనాలు ఏమన్నా కూర్చుని మాట్లాడుకున్నారా అంటే అదీ లేదు. ఆఖరికి ఖైదీ సినిమా 13న అని ఫిక్స్ అయ్యాక, శాతకర్ణి 12న అని ప్రకటించింది. అంటే ఏమనుకోవాలి, 11న తాము వస్తే, శాతకర్ణితో అనవసరపు పోటీ పడాలని ఖైదీ ఆలోచించింది అని అనుకోవాలి. కానీ ఫ్యాన్స్ మధ్య ప్రచారం ఎలా వుంటుంది? డైరక్ట్ ఫైట్ కు భయపడ్డారు అన్నట్లు వుంటుంది. 11న పోటీ పడితే గతంలో వున్న చేదు అనుభవాలు రిపీట్ అవుతాయని, సెంటిమెంట్ ఫీలయ్యారేమో అన్న గుసగుసలు కూడా వున్నాయి. 

ఏవైతేనేం మొత్తానికి శాతకర్ణి తను అనుకున్న డేట్ కే వస్తోంది. ఖైదీ తాను అనుకున్న డేట్ కు రాలేకపోయింది.