సాధారణంగా సినిమా సెన్సారు అయిందంటే, జనాలు చెవులు అన్నీ సెన్సారు జనాల అభిప్రాయాల కోసం నిక్కి మరీ రెడీగా వుంటాయి. ఇప్పుడు శాతకర్ణి విషయంపై కూడా అలాంటి ఆరాలే సాగుతున్నాయి. శాతకర్ణి సినిమా సెన్సారు టాక్ ఏమిటి? అన్నదే లేటెస్ట్ క్వశ్చన్.
శాతకర్ణి సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ కు ఎక్కువ మార్కులు పడతాయన్నది వినిపిస్తున్న టాక్ సారాంశం. ఇంటర్వెల్ ముందు ఇరవై నిమషాల నుంచి సినిమా రేంజ్ పెరగడం ప్రారంభమవుతుందట. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ మంచి స్థాయిలో వుందని తెలుస్తోంది. అలాగే సినిమాలోని నదిపై ఫైట్ హైలైట్ గా వుంటుందట.
సినిమా ఆద్యంతం గౌతమీ పుత్ర శాతకర్ణి కి కనెక్ట్ గానే వుంటుందని వినికిడి. అందువల్ల బాలకృష్ణ లేని సీన్లు చాలా తక్కువ వుంటాయని తెలుస్తోంది. ఇది కచ్చితంగా బాలయ్య అభిమానులకు నచ్చే విషయమే. సినిమాలో విజువల్స్ చాలా బాగా వచ్చాయని, ఓ హెవీ బడ్జెట్ ఫిల్మ్ చూసిన ఫీల్ వుందని తెలుస్తోంది. ఈ విజువల్ వండర్స్ కి, ఎమోషనల్ కంటెంట్ కి క్రిటిక్స్ అప్లాజ్ వుంటుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.
సెన్సార్ టాక్ అన్నది కేవలం మౌత్ టు మౌత్ సాగేది. ఇందులో నిజమెంత అన్నది సినిమా విడుదల తరువాతే పక్కాగా తెలిసేది.