శాతకర్ణి సినిమా టాకీ దాదాపు పూర్తయిపోయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది. గ్రాఫిక్స్ వర్క్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కు వచ్చేస్తుందని తెలుస్తోంది. డైరక్టర్ క్రిష్ వెల్ ప్లాన్డ్ గా ముందుకు వెళ్లడంతో సినిమా అంతా చాలా అడ్వాన్స్ గానే రెడీ అయిపోయింది. సినిమా రష్ ను చూసిన కొందరు బయ్యర్లు అబ్బో..సూపర్ అంటున్నారు.
ఈ టాక్ అలా అలా ఇండస్ట్రీ బిజినెస్ సర్కిళ్లలో పాకిపోయింది. స్టోరీ, ఎమోషన్ పార్టీ అన్నీ చాలా బాగా వచ్చాయని రష్ చూసిన వారి మాట. ట్రయిలర్ కూడా క్రిష్ కట్ చేసేసారట. ఇది ఈ నెలాఖరులో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ విడుదల చేస్తారు. ఇదిలా వుంటే శాతకర్ణి సినిమా క్లయిమాక్స్ విషయమై దర్శకుడు క్రిష్ ఇంకా ఏమీ తేల్చుకోలేదని, రెండు రకాల క్లయిమాక్స్ లు చిత్రీకరించి వుంచారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా చరిత్రలో మిగిలిన పోయిన వారి కథలు పూర్తిగా తెరకెక్కిస్తే, వారి మరణంతో సినిమా పూర్తవుతుంది. అది అన్నమయ్య అయినా, మరే సినిమా అయినా అంతే. శాతకర్ణి ముగింపు కూడా అలాగే వుండాలి. అయితే ఫ్యాన్స్ మనోభావాలు దృష్టిలో వుంచుకుని, చివర్న అలా వదిలేసి, వాయిస్ ఓవర్ తో క్లోజ్ చేయాలా అనే ఆలోచన కూడా వుందట. ఇలా రెండు క్లయిమాక్స్ ల గురించి క్రిష్ ఆలోచిస్తున్నారట.