సత్యమూర్తి అదృష్టం

కొందరు హీరోలకు అదృష్టం కలిసి వస్తుంటుంది. మెగా హీరోల వైనం అలాంటిదే. ఆచి తూచి సినిమా వదుల్తారు. ఆ తరువాత వస్తాయనుకున్నవి రావు..వచ్చినవి పేలిపోతాయి. ఈ సినిమా కాస్త అటు ఇటుగా వున్నా అలా…

కొందరు హీరోలకు అదృష్టం కలిసి వస్తుంటుంది. మెగా హీరోల వైనం అలాంటిదే. ఆచి తూచి సినిమా వదుల్తారు. ఆ తరువాత వస్తాయనుకున్నవి రావు..వచ్చినవి పేలిపోతాయి. ఈ సినిమా కాస్త అటు ఇటుగా వున్నా అలా అలా నలభై కోట్ల మార్కు దాటేస్తుంది. ఇప్పుడు సత్యమూర్తి వ్యవహారం కూడా అలాంటిదే. యాభై కోట్లకు పైగా మొత్తానికి థియేటర్ రైట్లు అమ్మారు. సినిమా విడుదలైన అయిదు రోజులకే గట్టెక్కడం కష్టం అన్న టాక్ యునానిమస్ గా వినిపించింది. 

సగానికి సగం పోతుంది అనుకున్నారు. కానీ చిత్రంగా ఆ తరువాత వచ్చిన సినిమాలు టైమ్ కు రాలేకపోవడమో, చిన్న సినిమాలు కావడమో, పెద్దవి డిజాస్టర్లు కావడమో..మొత్తానికి అన్ని విధాలా కలిసి వచ్చింది. అలా అని ఇప్పుడు కూడా లాభాలేమీ దండేసుకోలేదు. ఆంధ్ర తెలంగాణ కలిసి అసలు సిసలు షేర్ ముఫై అయిదు కోట్లు దాటిందని వినికిడి. అన్నీ కలిపి నలభై మూడు వరకు వచ్చిందంటున్నారు. 

అయితే ఏకంగా పది కోట్లు పోయిందనిపిస్తుంది కానీ, ఇక్కడో గమ్మత్తు వుంది. దాదాపు డజను మంది బయ్యర్లు. అంతమంది మీద సగటున 20 లక్షల నుంచి యాభై లక్షల వరకు లాస్ కనిపిస్తోంది. అయితే బయ్యర్లు ఓ పెద్ద సినిమా మీద పదీ ఇరవై పోవడం, రావడం పెద్ద విషయం కాదు. పైగా పెద్దబ్యానర్. ఇంకా సినిమాలు వస్తాయి. అప్పుడు చూసుకుంటారు. అందుకే ఇప్పుడు బయ్యర్లు కూడా పెద్దగా అసంతృప్తి ఫీల్ కావడం లేదు. ఈవారం, వచ్చేవారం సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా వుంటే ఈ సమ్మర్ సీజన్ మొత్తానికి సత్యమూర్తి ఒక్కడే సోలో పెర్ ఫార్మర్ అవుతాడు.