సత్యమూర్తి డేట్ కన్ఫర్మేనా?

సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తేదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్లుగా ఏప్రిల్ 2న కాక ఎనిమిదిన విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 2న విడుదల చేయడానిక చిత్ర నిర్మాతలు, యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా…

సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తేదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్లుగా ఏప్రిల్ 2న కాక ఎనిమిదిన విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 2న విడుదల చేయడానిక చిత్ర నిర్మాతలు, యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చిన్నచిన్న పనులు మిగిలాయని వినికిడి. 

అనుకున్న షెడ్యూలు ప్రకారం ఇవన్నీ పూర్తయినా కూడా లాస్ట్ మినిట్ టెన్షన్ వుంటుందని, అందుకనే 8న విడుదల చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ వైనం తెలిసే, యువి క్రియేషన్స్ సంస్ధ తమ జిల్ విడుదలకు 27న ముహుర్తం కన్ ఫర్మ్ చేసింది. 

సత్యమూర్తి వారం వెనక్కు వెళ్తే చాలు జిల్ కు లాభాల బాటలో పయనించడానికి. లేదంటే, కనీసం 10శాతం థియేటర్లయినా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్, సత్యమూర్తి సినిమాలు రెండిటిపైనా మంచి అంచనాలున్నాయి.