హమ్మయ్య.. ఓ పనైపోయింది. నాగార్జున అర్జెంట్ గా సవ్యసాచి సినిమా చూసేసాడు. ఎడిటింగ్ సూట్ కు వచ్చి ఓపిగ్గా ఇప్పటి వరకు తీసిన సినిమా మొత్తం చూసేసాడు. సవ్యసాచి విడుదల డేట్ మీద కిందామీదా అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాల్ ను చైతన్య నేరుగా నాగ్ కోర్టులోకి తోసాడు. దాంతో ఆయన వచ్చి సినిమా చూసాడు.
వాస్తవానికి ఇంకా పదిరోజుల చిన్న చిన్న షూట్ లు బకాయి వున్నాయి. అవన్నీ మిక్స్ చేసిన తరువాత ఫైనల్ ఎడిటింగ్ చేసి, కీరవాణికి రీ రికార్డింగ్ కు ఇవ్వాల్సి వుంది. అయినా రీరికార్డింగ్ లేకుండానే సినిమా మొత్తం చూసిన నాగ్, స్టోరీ కాన్సెప్ట్ బాగుందని మెచ్చుకున్నట్లు బోగట్టా. మంచి కాన్సెప్ట్ తీసుకున్నా, బాగా చేసుకోండి అని ఓ సలహా ఇచ్చేసాడు.
ఇక ఇప్పుడు నాగ్ ఇంటికెళ్లి చైతూకి ఏం చెబుతాడో? దానిపై చైతూ డేట్ లు ఎలా సెట్ చేస్తాడో? శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాల్లో దేన్ని ఎప్పుడు విడుదల చేయమంటాడో చూడాలి. సవ్యసాచి యూనిట్ తో చైతన్య మరో ఒకటి రెండురోజుల్లో సెట్ చేసే మరో మీటింగ్ లో తేలుతుంది.
ఇదిలా వుంటే సంగీత దర్శకుడు కీరవాణి రీరికార్డింగ్ కోసం దాదాపు మూడు వారాలకు పైగా అవసరం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా అయిన పక్షంలో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో సవ్యసాచి విడుదల కష్టం అవుతుంది. జూలై 20 తరువాత చైతన్య డేట్ లు ఇచ్చి, జూలై ముఫై తరువాత రీరికార్డింగ్ కు ఇస్తే, ఫస్ట్ కాపీ ఎప్పటికి రెడీ అవుతుందో? చూడాలి.