ఐదేళ్ల కిందట ఇదే వార్త రాయడం. నాలుగేళ్ల పాటు ఇదే వార్త రాయడం.. ఐదో ఏడాది కూడా మళ్లీ ఆమె గురించినే రాయడం. ఇంటర్నెట్ ట్రెండ్స్ గురించి వార్తలు రాసే జర్నలిస్టులకు బోర్ కొట్టేసేంత స్థాయిలో ఉంది ఆమె క్రేజ్! ఇంత ఇంట్రడక్షన్ మరెవరి గురించినో కాదు.. పోర్నోస్టార్ సన్నీలియోన్ గురించి!
ఐదేళ్ల కిందట బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ఇండియన్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది సన్నీ. ఆ స్కాండల్ హౌస్ ఈ ఇండో కెనడియన్ పోర్నో స్టార్ పాల్గొనడం.. సంచలనంగా నిలిచింది. అప్పటి వరకూ కేవలం పోర్న్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న ఈ భామ … బిగ్ బాస్ ద్వారా ఫ్యామిలీ టైపు జనాలకు కూడా పరిచయం అయ్యింది!
కవర్ స్టోరీలు.. బ్యానర్ స్టోరీలు.. ఎవరీ సన్నీ ఏమిటీ ఈమె కథ…అంటూ భారతీయ మీడియా మొత్తం రకరకాల కథనాలు రాసింది. సన్నీ గురించి ఒక్కోరు ఒక్కో విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెకు పెళ్లి అయ్యిందన్న విషయాన్ని చెబుతూ.. సర్ ప్రైజ్ చేశారు.
ఇలా ట్రెండ్స్ లో భాగమైంది సన్నీ. భారతీయులకు ఈమె బాగా పరిచయం అయిన ఏడాది .. చివర్లో విడుల అయిన ఇంటర్నెట్ గణాంకాల్లో సన్నీ పేరు ప్రముఖంగా నిలిచింది. భారతీయులు గూగుల్ లో అత్యధికంగా టైప్ చేసిన కీవర్డ్ సన్నీ లియోన్ అనే విషయం వెల్లడైంది. ఆ ఏడాది ఆ విధంగా ఆమె టాప్ లో నిలవడంతో చాలా మంది ఆశ్చర్య పోయారు.
ఆ ఆశ్చర్యం ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది.. వరసగా ఐదో సంవత్సరం సన్నీ ఇండియన్ సెర్చింగ్ సెలబ్రిటీల్లో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఒక సెలబ్రిటీ పట్ల మరీ ఇన్ని సంవత్సరాలు ఒకే స్థాయి క్రేజ్ కంటిన్యూ కావడం కేవలం సన్నీ విషయంలోనే జరుగుతోందని అనుకోవాలి.
ఈ ఏడాది అయితే ప్రధానమంత్రి మోడీ, షారూక్ , సల్మాన్ లను మించిన స్థాయిలో సన్నీ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ జరిగింది. ఇన్ని పొలిటికల్ ఇష్యూలు, సినిమా సంగతులను దాటేస్తూ సన్నీ టాప్ లో నిలిచింది.
మరి దీని భావం ఏమిటి? అంటే.. భారతీయులు ఇంటర్నెట్ లో పోర్న్ బాగా చూస్తున్నారని! సన్నీని ఎక్స్ పోర్నోస్టార్ అంటున్నా.. ఆమె కు సంబంధించిన పోర్న్ కంటెంట్ నెట్ లో బోలెడంత ఉండనే ఉంది. సన్నీ సోషల్ సినిమాల్లో నటిస్తోంది, ఆమె వివిధ రకాలుగా వార్తల్లో నిలుస్తోంది. కాబట్టి.. ఆమె టాప్ లో నిలిచి ఉండొచ్చు అనుకోవడం కేవలం బుకాయింపు మాత్రమే! ఆమె నటిస్తున్న సోషల్ సినిమాలను పట్టించుకునే నాథుడు ఎవరూ లేరు. కాబట్టి ఈ ఆదరణ అంతా నిస్సందేహంగా పోర్న్ కు దక్కుతున్నదే!