సెట్ నుంచి జయసుధ ఔట్

జయసుధ లాంటి సీనియర్ నటికి కోపం వచ్చింది. అంతే సినిమా ఆగిపోయింది. ఇదంతా ఆర్ నారాయణ మూర్తి కానిస్టేబుల్ గా, జయసుధ ఆయన భార్యగా నటిస్తున్న సినిమా వ్యవహారం. Advertisement ఆ సినిమా సెట్…

జయసుధ లాంటి సీనియర్ నటికి కోపం వచ్చింది. అంతే సినిమా ఆగిపోయింది. ఇదంతా ఆర్ నారాయణ మూర్తి కానిస్టేబుల్ గా, జయసుధ ఆయన భార్యగా నటిస్తున్న సినిమా వ్యవహారం.

ఆ సినిమా సెట్ లో నిర్మాతకు, జయసుధకు మాట మాట వచ్చి, ఆ సినిమా చేయనని చెప్పేసి జయసుధ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, సాధారణంగా ఏ షూటింగ్ కు అయినా జయసుధ పది గంటలకు ఠంచనుగా హాజరవుతారు. ఆమె పనులు తెముల్చుకుని, మేకప్ వేసుకుని వచ్చేసరికి ఆ టైమ్ అవుతుంది. ఈ సినిమాకు కూడా ఆమె అలాగే పది గంటలకు వచ్చారట. దీంతో సినిమా నిర్మాత కమ్ దర్శకుడు, ఆమెను నిలదీసినట్లు తెలుస్తోంది.

తన సినిమా షూటింగ్ కు ఎవరైనా సరే 8.45 కు సెట్ లో వుండాల్సిందే అని గట్టిగా అరిచారని వినికిడి. తనకు కుదరదని, అలా అయితే సినిమా చేయనని జయసుధ అన్నారట. చేయకపోతే, మానేయండి అని నిర్మాత కమ్ దర్శకుడు అనడంతో జయసుధ, వెంటనే ఇంటికి వెళ్లిపోయారట. ఇది జరిగి మూడు నాలుగు రోజులయింది.

ఇప్పుడు నిర్మాతకు జయసుధకు మధ్య సయోధ్య కుదిర్చి, సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి పంచాయతీలు నడుస్తున్నాయి. ఏమవుతుందో మరి.