Advertisement


Home > Movies - Movie Gossip
సెటిల్ మెంట్ దిశగా అజ్ఞాతవాసి

టాలీవుడ్ లో డిజాస్టర్లు అబ్బురమేమీ కాదు. అయితే అంతంత రేట్లకు అమ్మితే కొనుక్కుని ఎవడు చూడమన్నాడు. అంతంత అడ్వాన్స్ లు అడిగితే థియేటర్లు ఎందుకు ఇచ్చాయి. ఆ రేట్లు చెబితే బయ్యర్లు ఎందుకు కొన్నారు. ఆశ.. ఆశ.. తమ హీరో సినిమా బాగుంటుందని, తమ థియేటర్లో సినిమా హవుస్ ఫుల్ గా రన్ అవుతుందని, తాము కొన్న సినిమా లాభాలు పండిస్తుందని. ఆశ. కానీ తేడా వస్తే రాజుగారు ఏడు చేపల కథ రిపీట్ అవుతుంది.

కానీ ఫస్ట్ టైమ్ ఫర్ ఏ ఛేంజ్. అజ్ఞాతవాసి బయ్యర్లతో సినిమా విడుదలయిన మూడు వారాల లోపే సెటిల్ చేసుకోవాలని నిర్మాత రాధాకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వన్స్ థియేటర్స్ రన్ క్లోజ్ కాగానే అక్కౌంట్స్ చూసుకుంటారు. బయ్యర్లకు అమ్మిన రేట్లు, వాళ్లు థియేటర్ల నుంచి తీసుకున్న ఫిక్స్ డ్ రేట్లు, అడ్వాన్స్ లు, కలెక్షన్లు అన్నీ తెప్పిస్తారు.

సినిమాకు అయిన ఖర్చు, అమ్మిన రేట్లు, మిగిలిన లాభం అన్నవి క్లియర్ గా డిస్కస్ చేసే అవకాశం వుంది. ఆపైన తన వంతు ఏం చేయగలరు. ఎలా చేయగలరు అన్నది నిర్మాత చినబాబు క్లియర్ గా వివరించి, ఓ మాట అనేసుకుంటారు. దాంతో అజ్ఞాతవాసి వ్యవహారాలు అన్నీ క్లోజ్ అయిపోతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అవసరం అయితే ఓ పదో, పదిహేనో వదులుకోవడానికి కూడా నిర్మాత చినబాబు సిద్దం అని తెలుస్తోంది. ఇండస్ట్రీలో హారికహాసిని చినబాబు అంటే ఓ మంచి పేరు వుంది. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఒకరిని నొప్పించరు. బయ్యర్లను జాగ్రత్తగా చూసుకుంటారు అని ఇలా అజ్ఞాతవాసి సెటిల్ మెంట్ కు డిసైడ్ కావడానికి ఇదీ ఒక కారణం. కానీ ఇదే కారణం కాదు. ఇంకా వేరే కారణాలు కూడా వున్నాయి.

వచ్చే నెలలో ఎన్టీఆర్ సినిమా సెట్ మీదకు వెళ్తోంది. అజ్ఞాతవాసి కోసం తన సినిమాను కాస్త తక్కువలో తీయడం, ఎక్కువకు అమ్మి, ఈ లాస్ లు బయ్యర్లకు పూడ్చడం వంటి వ్యవహారాలు వుంటాయని ఎన్టీఆర్ అనుకోవడానికి చాన్స్ ఇవ్వకూడదు. అలాగే సినిమా పూర్తయ్యాక డిస్కౌంట్ రేట్లలో అమ్మడం, దాని వల్ల తన సినిమా రేంజ్ ఇదేనా హీరో ఫీల్ కావడం వుండకూడదు.

వీటన్నింటికి మించి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా రేంజ్ అన్నది ఎలా వుంటుందన్నది ఆరునెలల తరువాతి మాట. అప్పుడు రేట్లు ఎలా పలుకుతాయో తెలియదు. ఇప్పటి బయ్యర్లతో ఆబ్లిగేషన్ లు వుంటే అదో సమస్య.

అందుకే అన్ని విధాలా ఆలోచించి ఇప్పుడే సెటిల్ చేసుకునే ఆలోచనలో వున్నారు నిర్మాత చినబాబు.