'బాహుబలి'తో జాతీయ వ్యాప్తంగా స్టార్ అయితే అయ్యాడు కానీ ఇంకా బాలీవుడ్ టాప్ హీరోయిన్ల దృష్టిలో ప్రభాస్ స్టార్ అయినట్టు లేడు. ఎట్లీస్ట్ ఖాళీ చేసుకుని అతగాడికి డేట్స్ ఇచ్చేటంత పాపులర్ అయితే కాలేదు. అందుకే సాహోకి నిర్మాతలు ప్లాన్ చేసుకున్నట్టుగా స్టార్ హీరోయిన్ ఎవరూ దొరకలేదు.
వచ్చే వేసవిలో విడుదల చేయాలని చూస్తోన్న ఈ భారీ చిత్రం ఇంతవరకు మొదలు కాకపోవడంతో ఇక ఆలస్యం చేయకుండా పని మొదలు పెట్టాలని చూస్తున్నారు. అందుకే హీరోయిన్గా పూజ హెగ్డేని ఓకే చేసినట్టు చెబుతున్నారు. పూజ కూడా బాలీవుడ్ వారికి 'మొహంజుదారో' చిత్రంతో పరిచయమైంది. హృతిక్ సినిమా కాబట్టి పాపులర్ కూడా అయింది.
బాలీవుడ్ మార్కెట్ కీలకంగా భావిస్తున్నారు కనుక అక్కడ ఇంపాక్ట్ చూపించగల హీరోయిన్ కోసం చూసి ఫైనల్‌గా పూజకి ఓటేసారట. 'దువ్వాడ జగన్నాథమ్' తర్వాత ఆమె క్రేజ్ టాలీవుడ్‌లోను పెరుగుతుందని అంచనా. సాహోకి పూజ వల్ల ఎంత ప్లస్ అనేది తెలియదు కానీ బాహుబలి తర్వాతి సినిమాలో ప్రభాస్‌కి జత కట్టడం ఖచ్చితంగా ఆమెకి బోనస్సే.