Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షూటింగ్ కు మెగాస్టార్ నో

షూటింగ్ కు మెగాస్టార్ నో

కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి. దాదాపు ప్రతి హీరో సెట్ మీదకు వస్తున్నారు. ఇప్పటికీ రావాల్సిన హీరోలు చాలా మంది వున్నారు.

ముఖ్యంగా ఫినిషింగ్ స్టేజ్ లో వున్న నారప్ప కోసం హీరో వెంకటేష్, ఇప్పటికైనా చకచకా షూట్ చేసి ఫినిష్ చేయాల్సిన సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాల్సి వుంది. 

కానీ ఈ ఇద్దరూ ఇప్పట్లో షూటింగ్ కు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పట్లో తాను షూటింగ్ కు వచ్చేది లేదని మెగాస్టార్ క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వెంకీ కూడా ఇప్పట్లో షూటింగ్ కు రావడం లేదని తెలుస్తోంది. నిజానికి నారప్పకు పెద్ద సమస్య లేదు. ఎప్పుడు వెంకీ షూట్ కు వచ్చినా నెల రోజుల లోపే సినిమా రెడీ అయిపోతుంది.

కానీ ఆచార్యకే సమస్య. గట్టిగా ముఫై శాతం కూడా షూటింగ్ జరగలేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. మెగాస్టార్ చేయాల్సిన లెంగ్తీ షెడ్యూలు అలాగే వుంది. చరణ్ చేయాల్సిన 30 రోజుల వర్క్ అలాగే వుంది. ఈ సినిమాను ఏప్రియల్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో రెడీ అవుతుందా? అన్నది అనుమానమే.

ఉద్యమానికి చంద్రబాబే పెద్ద అడ్డంకి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?