Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షూటింగ్ లు ఎప్పుడు? సినిమాలు ఎప్పుడు?

షూటింగ్ లు ఎప్పుడు? సినిమాలు ఎప్పుడు?

టాలీవుడ్ డెలిగేషన్ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి,  షూటింగ్ లు చేసుకోవడానికి అనుమతి కోరి వచ్చింది. రెగ్యులర్ పనులు చేసుకోమని, మరీ భారీ షూటింగ్ ల సంగతి ఆలోచిస్తామని ఆయన మాట ఇచ్చారు. మరి ఇంతకీ షూటింగ్ లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? అలాగే సినిమా విడుదలలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. అన్నది అసలు క్వశ్చను. 

ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం సినిమాల షూటింగ్ ఇంకో ఇరవై రోజులకు వరకు ప్రారంభం కాకపోవచ్చు. జూన్ 15 నుంచే షూటింగ్ లు వుంటాయని తెలుస్తోంది. విడుదలకు దాదాపు సిద్దంగా వున్న ప్రతి సినిమాకు కనీసం అయిదు నుంచి పది రోజులు ప్యాచ్ వర్క్ వుంది. మరి కొన్ని సినిమాలకు ఎక్కవ వర్క్ నే వుంది. కొన్ని సినిమాలకు పాటల పని పెండింగ్ వుంది. 

పాటల కోసం విదేశాలకు వెళ్లే వ్యవహారం లేదు. అందువల్ల సెట్ లు కావాల్సిందే. అందుకే పాటల చిత్రీకరణ టైమ్ తక్కువే అయినా, ఈ ప్రిపరేషన్ కాస్త ఎక్కువే. అందువల్ల షూటింగ్ లు ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశం తక్కువగా వుంది. ఇక ఈ సంగతి ఇలా వుంచితే, అక్టోబర్ వరకు సరైన సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం కూడా లేదు. 

విడుదలకు రెడీ కావడానికి అవకాశం వున్న ఉప్పెన, వి, సోలో బతుకే సినిమాలు అన్నీ అక్టోబర్, ఆ పైన అన్న ఆలోచనతోనే వున్నాయి. ఆగస్టు నుంచి స్కూళ్లు తీస్తున్నారు. ఆ నెల అంతా అదే హడావుడి వుంటుంది. సెప్టెంబర్ అంత పాజిటివ్ సీజన్ కాదు. అందువల్ల అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలల మీద దృష్టిపెట్టారు నిర్మాతలు అంతా.

గిల్డ్ పెద్దల మంతనాలు

గిల్డ్ పెద్దలు అంతా కలిసి తెగ మీటింగ్ లు పెట్టేసుకుంటున్నారు. దాదాపు రోజూ లేదా రోజు విడిచి రోజూ మీటింగ్ లే మీటింగ్ లు.  అసలు ఎన్ని సినిమాలు వున్నాయి. ఎవరికి ఎప్పుడు డేట్ లు ఇవ్వాలి. అసలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పడు ఏ రేట్లు చెబుతారు. పాత కమిట్ మెంట్లు వుంటాయా? అసలు నిర్మాతలు అంతా కలిసి డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఇలాంటివన్నీ చర్చకు వస్తున్నట్లు బోగట్టా. 

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?