ఫర్హాన్ అక్తర్ తో సహజీవనం అంటూ.. తన గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించింది శ్రద్ధా కపూర్. ఈమెకు, ఆ దర్శకనటుడికి మధ్య ప్రేమాయణం అని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని, ఇది ఈమె తండ్రి శక్తీకి ఇష్టం లేదు.. ఇటీవల కూతురిని ఇంటికి తీసుకొచ్చేయడానికి కూడా ఆయన ప్రయత్నించాడని గట్టిగానే ప్రచారం జరిగింది.
ఫర్హాన్- శ్రద్ధాలు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి శక్తి కపూర్ హల్ చల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఇంత వరకూ వచ్చిన ఈ వ్యవహారంపై శ్రద్ధ స్పందించిన తీరు ఆసక్తి కరంగా ఉంది!
తన ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని ఈమె స్పష్టం చేసింది. తన గురించి జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని శ్రద్ధ తేల్చేసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని, దీన్ని ఇక ఆపాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్పందిస్తున్నట్టుగా శ్రద్ధ వ్యాఖ్యానించింది. తను తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాను అని ఈమె స్పష్టం చేసింది.
తనను వాళ్లు బాగా చూసుకుంటారని, తన పేరును ప్రేమాయణాల్లో వాడుకోవడం అందరికీ బాగా అలవాటైందని.. శ్రద్ధ మండిపడింది. మరి నిప్పులేనిదే పొగ రాదు అంటారు. శ్రద్ధ విషయంలో శక్తికపూర్ ఆందోళన గురించి చాలా చాలా వార్తలే వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని శ్రద్ధ ఒక్కమాటతో తేల్చేసింది!