మొత్తానికి హీరోయిన్ ఫిక్స్ కావడం వరకు వచ్చింది వెంకీ-తేజ సినిమా. ఇక సెట్ మీదకు వెళ్లాలి. ఇదిగో అదిగో అంటూ వస్తున్నారు. మార్చ 12 నుంచి అన్నది లేటెస్ట్ డేట్. ఈ సినిమాను వీలయినంత తక్కువ బడ్జెట్ లో చేయాలన్నది డైరక్టర్ తేజ ఆలోచన. అందుకే చాలా మందిని కొత్తవాళ్లనే తీసుకుంటున్నారు.
పైగా సురేష్ మూవీస్ భాగస్వామ్యంలో అంటే ఖర్చు దగ్గర అలాగే వుంటుంది వ్యవహారం. ఈ సినిమాకు కాజల్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ మళ్లీ మనసు మార్చుకుని శ్రియ దగ్గర ఫిక్స్ అయ్యారు.
కాజల్ కాకపోవడానికి, శ్రియ ఫిక్స్ కావడానికి కారణం మరేమీ కాదట. కేవలం పారితోషికమే అని తెలుస్తోంది. కాజల్ అయితే కోటి రూపాయల లోపు పారితోషికానికి రావడం కష్టం.
కానీ శ్రియ అనే సరికి వేరు. జస్ట్ 60లక్షల రెమ్యూనిరేషన్ కే శ్రియను ఈ ప్రాజెక్టుకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ, నారా రోహిత్ వున్నారు కాబట్టి శాటిలైట్ బాగానే వస్తుంది. పైగా తేజ, వెంకీ రెమ్యూనిరేషన్ కాకుండా, లాభాలు, ఇతరత్రా అడ్జస్ట్ మెంట్లు వుంటాయి కాబట్టి, ఈ సినిమాకు పెద్దగా ఖర్చు వుండకపోచవ్చు.