మరోసారి తెలుగులోకి శృతిహాసన్?

ఆమె సినిమాలు మానేసిందని కొందరన్నారు. పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ పుకార్లకు చెక్ చెబుతూ రీసెంట్ గా ఓ హిందీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చింది శృతిహాసన్.…

ఆమె సినిమాలు మానేసిందని కొందరన్నారు. పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ పుకార్లకు చెక్ చెబుతూ రీసెంట్ గా ఓ హిందీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చింది శృతిహాసన్. ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ తెలుగు సినిమాలో నటించబోతోంది శృతిహాసన్.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ట్రై చేస్తున్నారు. స్టోరీలైన్ విన్న శృతిహాసన్ మూవీలో నటించేందుకు దాదాపు ఒప్పుకున్నట్టు టాక్. గతంలో రవితేజ-శృతిహాసన్ కాంబినేషన్ లో బలుపు అనే సినిమా వచ్చింది.

తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు శృతిహాసన్. ఆ మూవీలో శృతి లుక్స్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖంలో మెరుపు తగ్గిందని, కాస్ట్యూమ్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ తో పాటు సోషల్ మీడియాలో తెగ హంగామా నడిచింది. ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.