Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శివ-చిరు సినిమాకు సన్నాహాలు

శివ-చిరు సినిమాకు సన్నాహాలు

సైరా సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ వుంది. ఇక దాని మీద మెగాస్టార్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పని లేదు. విడుదలకు డేట్ కూడా బయటకు వచ్చింది. అందువల్ల తన 152వ సినిమా మీద దృష్టిపెట్టారు మెగాస్టార్. టాప్ డైరక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.

ఆగస్టు నెలాఖరు లేదా, సెప్టెంబర్ నుంచి చిరు-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. గతంలో రంగస్థలం సినిమా కోసం విలేజ్ సెట్ వేసిన ప్రదేశం పక్కనే ఖాళీ స్థలంలో రెండు మూడు ఇళ్ల భారీ సెట్ నిర్మాణం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ విడుదల టార్గెట్ గా ఈ సినిమా రెడీ చేస్తారని టాక్.

ఇప్పటికే కొరటాల ఫుల్ బౌండ్ స్కిప్ట్ తో డైలాగ్ వెర్షన్ తో రెడీగా వున్నారు. స్టార్ కాస్ట్ కూడా బయటకు వెల్లడించడం లేదు కానీ దాదాపు అంతా ఫిక్సయినట్లు బోగట్టా. చిరు వయసుకు, స్థాయికి సరిపడా, మెసేజ్ ఓరియెంటెడ్ కథను కొరటాల రెడీ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?