హీరో రాజశేఖర్, నటి జీవితల కుమార్తె శివాని. ఆమెను హీరోయిన్ గా చూడాలని వారి కోరిక. శివానికి కూడా హీరోయిన్ కావాలనే వుంది. ఫ్రస్తుతం మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతోంది శివాని. సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నారు రాజశేఖర్ దంపతులు. గతంలో వారాహి బ్యానర్ ద్వారా తమ కుమార్తెను వెండి తెరకు పరిచయం చేయమని సాయి కొర్రపాటిని అడిగారు. ఆయన కూడా ఊ అన్నారు. కానీ సరైన ప్రాజెక్టు సెట్ కాలేదు.
ఇటీవల గరుడవేగ ప్రమోషన్స్ సందర్భంగా శివాని ఎక్కువగా మీడియా ముందుకు, పబ్లిక్ లోకి వచ్చారు. సినిమాలు, ప్రచారం, ఈ క్రేజ్ చూసిన తరువాత శివానీ మరింత త్వరగా తెరపైకి రావాలనుకుంటున్నట్లు వినికిడి. అయితే జీవిత రాజశేఖర్ కుమార్తెగా మరీ రొటీన్ హీరోయిన్ పాత్ర కాకుండా, కాస్తయినా కథలో ప్రాధాన్యత వున్న పాత్ర కోసం వెదుకుతున్నారు.
అలాంటి పాత్ర వున్న సినిమా ఆఫర్లు పెద్దగా కనిపించడం లేదు. ఎందకుంటే మన సినిమాల్లో హీరోయిన్ కు ప్రాధాన్యత వున్న కథలు చాలా తక్కువంటే చాలా తక్కువ వుంటాయి. పైగా అంత ప్రాధాన్యత వుంటే కొత్త హీరోయిన్ కు ఇవ్వడానికి జంకుతారు. అదీ సమస్య.
సాయుకుమార్ కుమారుడు ఆది సరసన ఓ హీరోయిన్ పాత్ర ఒకటి శివానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది కూడా జస్ట్ ఓ హీరోయిన్ పాత్ర మాత్రమే. కథలో మరీ ఇన్ వాల్వ్ అయిపొయేది కాదు. అందుకే చేయాలా? వద్దా అన్న డైలమాలో వున్నట్ల తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు శివానీ తన సినిమా కెరీర్ విషయం మీద సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.