మరీ లావుగా వుంటే ఈకాలం సినిమాలు చేయడం కష్టం. ఫైట్లు, డ్యాన్స్ లు ఎంత ఈజ్ తో చేసినా కూడా హీరో కాస్త చూడముచ్చటగా వుండాలి. అందుకే హీరోలంతా తమ తమ ఫిజిక్ పై దృష్టి పెడతారు. బన్నీ సిక్స్ ప్యాక్ తో తనను తాను మార్చుకున్నాడు. మంచు విష్ణు విదేశీ ట్రయినర్ ను పెట్టకుని మరీ సన్నబడ్డాడు..సునీల్ కూడా సంగతి కూడా ఇలాంటిదే. ఇక ఎన్టీఆర్ సంగతి అయితే అందరికీ తెలిసిందే. యమదొంగతో ఎలా మేకోవర్ అయిందీ.
అయితే ఇటీవల ఇద్దరు హీరోలకు ఇంకా లావు సమస్య మిగిలిపోయింది. నారా రోహిత్.. మంచు మనోజ్. ఈ మధ్య నారా రోహిత్ కాస్త ప్రయత్నించడం ప్రారంభించాడు. ఇప్పటికి పది కిలోల వరకు తగ్గినట్లు బోగట్టా. ఇక మంచు మనోజ్ కూడా ఇప్పుడు అదే పని మీద వున్నాడట. శౌర్య సినిమా చేదు ఫలితం ఇవ్వడంతో పాట, ఫిజిక్ మీద కామెంట్లు రప్పించడంతో, ఇక తగ్గి తీరాలని మనోజ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే రోహిత్ మాదిరిగా ఒక పక్క సినిమాలు చేస్తూ, తగ్గే ప్రయత్నం చేయడం కాకుండా, ఏక బిగిన దానిపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం ప్రాజెక్టులకు కామా పెట్టి, జిమ్ లోనే ఎక్కువగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. సో..త్వరలో కరెంటు తీగలాంటి సిక్స్ ప్యాక్ మనోజ్ ను చూసే అవకాశం వుందని తెలుస్తోంది.