Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్నేహం కోసం నాగ్ పక్కకు జరిగాడు

స్నేహం కోసం నాగ్ పక్కకు జరిగాడు

చిరుకు నాగ్ కు వున్న స్నేహం చాలా గాఢమైనది. ఇద్దరు కలిసే మా టీవీని పెంచి పెద్ద చేసారు. నాగ్ కు మంచి డైరక్టర్ కావాలి అంటే కురసాల కళ్యాణ్ కృష్ణను పరిచయం చేసాడు చిరంజీవి.  జస్ట్ ఇది చాలా చిన్న విషయం. ఇద్దరి మధ్య బంధం ఇంకా కాస్త లోతైనది. ఇప్పుడీ బంధం కోసమే, నాగ్ తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నుంచి పక్కకు జరిగాడు. 

కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని తెలుగులో చేయడం అంటే అంత సులువు కాదు.  పైగా రక్తి కట్టించడం అంటే మరీ కష్టం. మరి అలాంటి కార్యక్రమాన్ని తనదైన స్టయిల్ లో చేసి నాగ్ మంచి మార్కులు కొట్టేసాడు. మాటీవీ కి మాంచి ప్లస్ అయిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మీలో ఎవరు కోటీశ్వరుడు అన్న మాట వినగానే నాగ్ నే కళ్ల ముందు మొదుల్తాడు. అంతలా మమేకం అయిన కార్యక్రమాన్ని పాపం, నాగ్ తన స్నేహం కోసం పక్కన పెట్టాడు.

త్వరలో మెగాస్టార్ మీలో ఎవరో కోటీశ్వరుడు షో హాట్ సీట్ లో కనిపించబోతున్నాడు.ఎందుకోసం? టీవీ షో మీద ఇష్టంతోనో, తాను కూడా టీవీ షో ను హోస్ట్ చేయాలనో కాదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఖైదీ 150 సినిమాను విజయవంతం చేసి తీరాలని చిరంజీవి పట్టుదలగా వున్నాడు. దానికి ఉపయోగడపడే ఎత్తుగడలు, ఉపాయాలు ఎన్ని కావాలో అన్నీ టేకప్ చేస్తూనే వున్నారు. 

అందులో పార్ట్ నే ఈ టీవీ షో హోస్టింగ్ కూడా అని ఫీలర్లు వినిపిస్తున్నాయి. ఈ షో ద్వారా ఇంటింటి జనాలకు మరోసారి బాగా దగ్గర కావాలని చిరు అనుకుంటున్నారట. చిరు ఇప్పుడు కొత్తగా పరిచయం కావాలా అని అభిమానులు అనుకోవచ్చు. కానీ సినిమా జనాల థింకింగ్ వేరుగా వుంటుంది. సపోజ్, ఏదయినా సినిమా విడుదలయిందనుకోండి, వెంటనే చానెళ్లలో ఆ హీరో సినిమాలు వచ్చేలా చూస్తారు. ఈ సినిమా డైరక్టర్ చేసిన పాత సినిమాలను చానెళ్లలో వదుల్తారు. 

ఆ విధంగా జనాలకు ఓ సారి వాళ్ల వైనం గుర్తు చేస్తారు. దీనివల్ల కాస్తయినా ప్రయోజనం వుంటుదని సినిమా జనాల భావం.  ఇప్పుడు చిరంజీవి షో వ్యవహారం కూడా అలా ఓ ప్రయత్నం అన్నమాట. ఏదైనా చిరు 150 వ సినిమా విజయవంతం కావడానికి, నాగ్ కూడా తన వంతు సాయం చేసాడు మొత్తానికి. మాటీవీని స్టార్ గ్రూప్ కు అమ్మేసినా, దానిపై నాగ్, చిరు, అరవింద్, మాట్రిక్ ప్రసాద్ ల ఆధిపత్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదో ఉదాహరణ కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?