సోషల్ మీడియాలో మరో రచ్చ షురూ అయ్యింది సినీ సెలబ్రిటీ మీద. ఈసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఎవరో తెలుసా? కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. తెలుగులో 'ఛలో', 'గీత గోవిందం', 'దేవదాసు' చిత్రాల్లో నటించిన ఈ భామకి సోషల్ మీడియాలో అభిమానులెక్కువ. అభిమానులంటే ఎలా వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఒకటి పదింతల హంగామా చేస్తుంటారు. అది మామూలే.
ఓ అభిమాని రష్మిక మండన్న ఘనతల గురించి చెబుతూ, ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇటీవల ట్రెడిషనల్ వేర్ లంగా వోణీతో రష్మిక పోస్ట్ చేసిన ఫొటో అది. ఆ ఫొటో మీదున్న రష్మిక ఘనతలు ఓ నెటిజన్‌కి నచ్చలేదు. రష్మిక కన్నడ సినిమాల పాటల యూ ట్యూబ్ వ్యూస్ గురించిన రికార్డులవి. యూ ట్యూబ్ నిర్వాహకులు చూస్తే, నవ్వుకుంటారు జాగ్రత్త.. అన్నది సదరు వ్యక్తి చేసిన కామెంట్. రష్మికకి ఒళ్ళు మండింది. 'ఇష్టం లేకపోతే, లైట్ తీసుకో..' అంటూ ఆ వ్యక్తికి రష్మిక ఉచిత సలహా ఇచ్చింది. పైగా, 'నన్ను ఏమైనా అనే హక్కు మీకు వుండొచ్చు. నా అభిమానుల్ని మాత్రం ఏమీ అనొద్దు..' అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది రష్మిక.
అంతే, మేటర్ ఇంకాస్త సీరియస్ అయ్యింది. రికార్డులంటూ చెప్పుకుంటోన్న విషయాలకు ఆధారమేంటి.? అని నిలదీశాడు. 'నా టైమ్ వేస్ట్ చెయ్యొద్దు..' అని కౌంటర్ ఇచ్చింది రష్మిక. అలా కొంతసేపు కామెంట్స్ యుద్ధం తర్వాత ఆమె 'గుడ్ బై' చెప్పేసింది. 'ఛల్ హట్..' అంటూ రష్మికపై విరుచుకుపడ్డాడు ఆ నెటిజన్.
అయినా, సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయానికీ స్పందించాల్సిన అవసరమేముంది.? రకుల్ ప్రీత్ విషయంలో జరిగింది వేరు. పచ్చి బూతులు తిట్టాడో వ్యక్తి రకుల్‌ని. రష్మిక విషయంలో వ్యవహారం మరీ అంత సీరియస్ అవలేదు. రకుల్‌ని చూసి వాతలు పెట్టుకుందా.? అభిమానుల్ని మరింతగా ఎట్రాక్ట్ చేసేందుకు రష్మిక ఓవరాక్షన్ చేసిందా.? ఏమోగానీ, రష్మిక మీద ట్రాలింగ్ గట్టిగానే జరుగుతోందిప్పుడు. ఆమె అభిమానులూ హేటర్స్‌కి గట్టిగానే సమాధానం చెప్పేస్తున్నారండోయ్.