మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న స్పైడర్ సినిమా కోసం బాహుబలి టీమ్ రంగంలోకి దిగింది. మకుట గ్రాఫిక్స్, కమల్ కన్నన్ ఇప్పుడు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ లు, సిజి వర్క్ ల బాధ్యత తీసుకున్నారు. వాస్తవానికి ముందుగా సిజి మీద, విజువల్ ఎఫెక్ట్ ల మీద ఎక్కువ బడ్జెట్ అనుకోలేదు. రీజనబుల్ వర్క్ చేయిస్తే చాలు అనుకున్నారు. కానీ వన్స్ బాహుబలి 2 వర్క్, ఆ సక్సెస్ చూసిన తరువాత డైరక్టర్, హీరో అందరూ నిర్ణయం మార్చుకున్నారు.
క్వాలిటీ సిజి వర్క్ చేయించాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఈ ప్రాజెక్టును మకుట చేతిలో పెట్టారు. కానీ ఇలా చేయడం వల్ల ఓ మైనస్ పాయింట్ కూడా తప్పడం లేదు. బాహుబలి ప్రాజెక్ట్ తో తమ మకుట సంస్థకు వచ్చిన నేమ్ ను టైమ్ బౌండ్ పేరుతో పాడు చేసుకోలేమని, స్పెసిఫిక్ టైమ్ ఇస్తేనే స్పైడర్ ప్రాజెక్టు చేపడతామని మకుట సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఆగస్టులో వస్తుందనుకున్న స్పైడర్ రావడం లేదు. ఎప్పుడు వస్తుందన్నది మకుట సంస్థ ఇచ్చే క్లారిటీ మీద ఆధారపడి వుంటుంది. వాళ్ల కమిట్ మెంట్ డేట్ చూసుకుని, అప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటారు.
పూర్తిగా యాక్షన్ అండ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్పైడర్ సినిమాను దర్శకుడు మురుగదాస్ తీర్చి దిద్దుతున్నారు.