స్పైడర్ కు ఎక్కడ ఇబ్బంది అవుతోంది?

దసరాకు వారం తేడాతో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు స్పైడర్. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ జై లవకుశ వార్తలే. అదే సమయంలో ఎన్టీఆర్ విజువల్ ఇంటర్వూలు కూడా…

దసరాకు వారం తేడాతో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు స్పైడర్. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ జై లవకుశ వార్తలే. అదే సమయంలో ఎన్టీఆర్ విజువల్ ఇంటర్వూలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇదే సమయంలో స్పైడర్ గురించిన వార్తలు తక్కువగా వున్నాయి. ఎక్కడుంది లోపం? ఎందుకొచ్చిందీ తేడా?

ఇలా ప్రశ్నించుకుంటే వచ్చే అన్ని ఆన్సర్లలో ఒక్కటి మాత్రం కీలకం. అసలు ప్రాజెక్టుల్లోనే తేడా వుంది. జైలవకుశ మేకింగ్ ఇన్ హైదరాబాద్. మొత్తం అంతా. పైగా సినిమాలో మూడు క్యారెక్టర్లు, వాటి వ్యవహారాలు, దాదాపుగా కథ ఇలా దేన్నీ దాచడానికి యూనిట్ ప్రయత్నించినట్లు కనిపించలేదు. మూడు నాలుగు డైలాగులు దగ్గర నుంచి అన్నీ బయటకు వచ్చేసాయి. ఆఖరికి అయిటమ్ సాంగ్. అందులో రావణ తాండవం అన్నీ.. అన్నీ. దీంతో రాసుకునేవాళ్లకు, చదవాలనుకునేవాళ్లకు కావాల్సినంత ముడిసరుకు.

అదే స్పైడర్ దగ్గరకు వస్తే, అంతా చెన్నయ్ నే. అక్కడే అన్నీ. పైగా దర్శకుడు మురుగదాస్. అన్నింటికి మించి స్పైడర్ సబ్జెక్ట్. విజువలైజేషన్ కీలకంగా వుంటుంది తప్ప, చెప్పడానికి తక్కవ వుంటింది. తెరపైన చూడాల్సిందే. దానికి తోడు సినిమాలో ఈ సీన్ హైలైట్. ఈ డైలాగు హైలైట్ అన్నది ఎక్కడా బయటకు రానివ్వడంలేదు. మురుగదాస్ లాంటి డైరక్టర్లతో సమస్య ఇది. వారు సినిమా విడుదలకు ముందు ఇలాంటివి మాట్లాడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. తెరపై చూసి ఆనందించాలని అనుకుంటారు. కానీ మన తెలుగు కమర్షియల్ సినిమా వ్యవహారం వేరు. ఎన్ని విశేషాలు బయటకు వస్తే సినిమాకు అంత బజ్ వస్తుంది. తొలిరోజు థియేటర్ కు పరుగుపెట్టాలనే ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.

జైలవకుశ విషయానికి వస్తే ముగ్గురు ఎన్టీఆర్ లు, మూడు క్యారెక్టర్లు, మూడురకాల స్టయిలింగ్. ఫ్యాన్స్ కు కావాల్సినన్ని స్టిల్స్. కానీ అదే స్పైడర్ దగ్గర వస్తే, ఒక ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఎలా వుండాలో అలాగే వుండే సింగిల్ స్టయిలింగ్. ఇక్కడ కూడా మురుగుదాస్ లాంటి వాళ్లు కామన్ ఆడియన్స్, అభిమానుల సంగతి చూడరు. సబ్జెక్ట్ ను మాత్రమే చూస్తారు. పైగా ఫ్యాన్స్ కు ఏం కావాలి. స్టిల్స్ కావాలి. స్పైడర్ స్టిల్ కావాలంటే చెన్నయ్ నుంచి అనుమతి కావాలి. మీడియాకే స్పైడర్ స్టిల్స్ రావడంలేదు. ఇక అభిమానులకు ఎక్కడ వస్తాయి?

ఎన్టీఆర్ స్టిల్స్ ఎంచి ఎంచి మరీ, నిత్యం ఫ్యాన్స్ కు పంపేస్తున్నారు. స్పైడర్ విషయంలో ఆ పని చేయాలని మురుగదాస్ కు ఎవరు చెప్పగలరు? సినిమా ముందు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా వుంటారు. ఆయనను అడగడానికే యూనిట్ లో ఎవరికీ అంత ఏక్సెస్ వుండదు. టోటల్ గా డైరక్టర్ చిన్నవాడు కావడం, సబ్జెక్ట్ లో వేరియేషన్స్ వుండడం, ప్రొడక్షన్ అంతా లోకల్ కావడం అన్నది జై లవకుశ కు కలిసి వస్తోంది. డైరక్టర్ పెద్ద వ్యక్తికావడం, సబ్జెక్ట్ సీరియస్ కావడం, ప్రొడక్షన్ అంతా చెన్నయ్ కావడం అన్నది స్పైడర్ కు ఇబ్బందిగా మారుతోంది.