స్పైడర్ విడుదల డేట్ టెంటటివ్ గా సెప్టెంబర్ 27. అఫిషియల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబే ప్రకటించారు దసరాకు వస్తున్నాం అని. ఈ టార్గెట్ ను మీట్ కావడానికి స్పైడర్ యూనిట్ కిందా మీదా అవుతోంది.
24 గంటలు వర్క్ చేస్తోంది. మహేష్ ఇప్పుడు ఈ సినిమా మీదే వున్నారు. కానీ రకుల్ వర్క్ కాస్త ఎక్కువ వుండిపోయినట్లు తెలుస్తోంది. 15 రోజుల వర్క్ రకుల్ తో వుందని వినికిడి.
ఎలాగైనా జూన్ లో టాకీ ఫినిష్ చేసి, రెండు పాటలకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు స్లయిమెంటేనియస్ గా ఫినిష్ చేసారు. ఎడిటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతోంది. మరే విషయంలోనూ సమస్య లేదు.
కేవలం ఒక్క మకుట నుంచి విఎఫ్ఎక్స్ వర్క్ ఫినిష్ కావాలంతే. ఇది మాత్రం యూనిట్ చేతుల్లో, డైరక్టర్ చేతుల్లో లేదు. అది కూడా ఇన్ టైమ్ లో అయిపోతుందని అంటున్నారు. అక్కడే ఇండస్ట్రీ వర్గాలు స్పైడర్ విడుదల మీద డవుట్ పడుతున్నది. ఈ నెలాఖరుకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.