స్పైడర్ తెలుగు ప్రమోషన్ కు టైమ్ లేదా?

మహేష్ బాబు స్పైడర్ విడుదల రోజుల్లోకి వచ్చేసింది. కానీ ప్రమోషన్ ఏక్టివిటీ చూస్తే ఊపందుకోలేదు. సినిమా అడియో ఫంక్షన్ చెన్నయ్ లో చేసారు. ఇక్కడ ఇంతవరకు సింగిల్ ఏక్టివిటీ లేదు. 15న ప్రీ రిలీజ్…

మహేష్ బాబు స్పైడర్ విడుదల రోజుల్లోకి వచ్చేసింది. కానీ ప్రమోషన్ ఏక్టివిటీ చూస్తే ఊపందుకోలేదు. సినిమా అడియో ఫంక్షన్ చెన్నయ్ లో చేసారు. ఇక్కడ ఇంతవరకు సింగిల్ ఏక్టివిటీ లేదు. 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. అప్పుడు కానీ ట్రయిలర్ బయటకు రాదు.

ట్రయిలర్ వచ్చిన తరువాత ప్రమోషన్ వుంటుందా? అంటే అదీ లేదని తెలుస్తోంది. స్పైడర్ తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు కేవలం నాలుగు రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి 26వరకు మాత్రమే. ఇందులో 26లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సినిమా విడుదల 27నే.

15 తరువాత నుంచి ప్రమోషన్ ఏక్టివిటీలు వుంటాయా? అంటే లేదనే తెలుస్తోంది. మురుగదాస్ మీడియాతో మాట్లాడేసారు. ఇంకెవరు వున్నారు మాట్లాడడానికి? అందుకే 22తరువాత మహేష్ ఒక రోజు మీడియాను కలిసే అవకాశం వుంది. ఈ మధ్యలో ప్రమోషన్ అంతా తమిళనాటనే జరుగుతుందని తెలుస్తోంది.

నిజానికి తమిళ వెర్షన్ విలువ 20కోట్లు. తెలుగు వెర్షన్ విలువ 90కోట్లు. కానీ మురుగదాస్ తన ప్రాంతం, తన భాష, అక్కడ తన సినిమా విజయం ఇవన్నీ చూసుకుంటూ తెలుగు ప్రమోషన్ ను చెట్టెక్కించేస్తున్నారన్న అభిప్రాయం మహేష్ అభిమానుల్లో బలంగా వుంది.

నమ్రత ఎక్కడ?

గతంలో మహేష్ సినిమాలకు నమ్రత ప్రమోషన్ ఏక్టివిటీలను పర్యవేక్షించేవారు. అవసరం అయితే ఆమే నేరుగా మీడియా సంస్థలకు ఫోన్ లు కూడా చేసిన సందర్భాలు వున్నాయి. అలాగే అభిమానులతో నమత్ర వాట్సప్ గ్రూప్స్ లో టచ్ లో వుండి, ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుని, సరిదిద్దేవారు. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చేవారు. కానీ ఈ సారి ఈ సినిమా విషయంలో నమ్రత అస్సలు కలుగచేసుకుంటున్నట్లు లేదు. ఎందుకనో మరి తెలియదు.

ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే తీరు వేరుగా వుంది. అక్కడ ఎన్టీఆర్ స్వంత బ్యానర్ కావడం, అలాగే దర్శకుడు లోకల్ గా వుండడంతో పబ్లిసిటీ స్పీడప్ చేసేసారు.  జై లవకుశ ట్రయిలర్ కు భయంకరమైన వ్యూస్ వచ్చాయి. వ్యూస్ రావాలంటే ట్రయిలర్ బాగుండడం, హీరో క్రేజ్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఈక్వేషన్లు వుంటాయి. మరి స్పైడర్ విషయంలో ఇలా డల్ గా వుంటే,  వ్యూస్ తేడా వస్తే, అభిమానులు ఫీలవడం గ్యారంటీ.  అభిమానులు ఫీలయితే మహేష్ బాబు ఫీలవడం అంతకన్నా గ్యారంటీ.