మహేష్ బాబు-మురుగదాస్ స్పైడర్ కూడా దసరాకు ఫిక్సయిపోయింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నిర్మాత ఠాగూర్ మధు కలిసి ఈ మేరకు డిస్కషన్లు జరిపి ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
27 నుంచి అయితే వరుసగా ఆరు రోజులు సెలవు వస్తోందని, అంత లాంగ్ వీకెండ్ మళ్లీ రాదని ఇలా డిసైడ్ అయ్యారు. అయితే జై లవకుశకు కూడా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. అందుకే వీలయితే జై లవకుశను ఏ మాత్రం అవకాశం వున్నా వన్ వీక్ ముందుకు జరిపితే బెటర్ అన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
స్పైడర్ సినిమా రెండుపాటలు, వన్ డే ప్యాచ్ వర్క్ మినహా అంతా పూర్తయింది. మహేష్ మినహా ఫస్ట్ హాప్ డబ్బింగ్ పూర్తయింది. జూలై అయిదు లోపు మిక్సింగ్ చేసి, అప్పటి నుంచి రీరికార్డింగ్ కు కాపీ అందిస్తున్నారు.
జూలై పది ఓ పాట ఫినిష్ చేస్తారు. అక్కడికి ఒక్క సాంగ్ మాత్రమే బాకీ వుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు భరత్ అనే నేను సినిమా నుంచి గ్యాప్ తీసుకుని వచ్చి, సాంగ్, డబ్బింగ్ ఫినిష్ చేస్తా అని మహేష్ మాట ఇచ్చాడట.
దసరాకు ఈ సినిమా, సంక్రాంతికి కొరటాల శివ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని మహేష్ పట్టుదలగా వున్నాడట. అందుకే స్పైడర్ షూట్ నుంచి గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివ సినిమా చేస్తున్నాడు.