Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రద్ద రెమ్యూనిరేషన్ ఎంత?

శ్రద్ద రెమ్యూనిరేషన్ ఎంత?

సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్ల రెమ్యూనిరేషన్ అయిదు, పదిలక్షల నుంచి కోటి, కోటిన్నర వరకు వుంటుంది. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పక్కాగా ఆ హీరోయిన్ తప్ప మరొకరు చేయలేరు అనుకున్నపుడు మాత్రమే కోటి దాటుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాస్త ఎక్కువ రెమ్యూనిరేషన్ నే ఇస్తుంటారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు విజయశాంతికి రెండు నుంచి మూడుకోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చారని టాక్ వుంది. మన్మధుడు 2 సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ కు కోటిన్నరకు పైగా రెమ్యూనిరేషన్ ఇచ్చారని టాక్ వుంది.

ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్, సాహో విషయానికి వస్తే ఆ సినిమాలో హీరోయిన్ శ్రద్ధ కపూర్. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్ ల రేట్లు కాస్త భారీగానే వుంటాయి. అవి భరించగలిగితేనే తెలుగు సినిమాలకు తీసుకోవాలి. సాహో పాన్ ఇండియా సినిమా కాబట్టి, బాలీవుడ్ హీరోయిన్ అవసరం అని కోరి మరీ తీసుకున్నారు.

ఇందుకోసం శ్రద్దకపూర్ కు ఇచ్చిన రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు అని తెలుస్తోంది. ఇది కేవలం రెమ్యూనిరేషన్ మాత్రమే. జీఎస్టీ, పర్సనల్ స్టాఫ్, ఖర్చులు అన్నీ అదనం.  అయితే శ్రద్ధ కపూర్ ను తీసుకోవడం వల్ల నిర్మాతకు వచ్చేలాభం లేదా అదనపు ఆదాయం కూడా అలాగే వుంటుంది. బాలీవుడ్ విడుదల, డిజిటల్ రైట్స్ వగైరా ఆ రేంజ్ లోనే వుంటాయి. అందువల్ల అదేమీ భారం అనిపించదు. అదనపు అట్రాక్షన్ అవుతుంది.

జనసేన... బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?