శ్రీరెడ్డి ఫస్ట్ బౌన్సర్ వైవా హర్ష మీద

ఇప్పటి దాకా ఏదో గాలి మాటలు, ఘాటు మాటలే తప్ప, సాక్ష్యాలు బయట పెట్టని శ్రీరెడ్డి తొలిసారిగా కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్ లు పోస్ట్ చేసింది. ఆమె తన ఫేస్ బుక్ వాల్…

ఇప్పటి దాకా ఏదో గాలి మాటలు, ఘాటు మాటలే తప్ప, సాక్ష్యాలు బయట పెట్టని శ్రీరెడ్డి తొలిసారిగా కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్ లు పోస్ట్ చేసింది. ఆమె తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్ట్ చేసిన ఈ వాట్సప్ మెసేజ్ స్క్రీన్ షాట్ లు కమెడియన్, యూట్యూబ్ లో బాగా పాపులారిటీ వున్న వైవా హర్షవి.

విశాఖకు చెందిన వైవా హర్ష, యూట్యూబ్ లో స్కిట్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యాడు. అలాంటి వైవా హర్ష, ఈ వాట్సప్ మెసేజ్ ల్లో మరీ అంతలా కాకున్నా, కాస్త రసికుడిగా ప్రవర్తించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా ఆమెను రూమ్ కు లాగాలన్న ప్రయత్నం కనిపించింది.

మా అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వమని తెగేసి చెప్పడంతో శ్రీ రెడ్డి తరువాతి యాక్షన్ ప్లాన్ కు దిగింది. అందులో భాగంగా వైవా హర్ష వ్యవహారాలు బయట పెట్టింది. మరోపక్క తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, తనను ఇల్లు ఖాళీ చేయమని హవుస్ ఓనర్ కోరారని కూడా ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

వైవా హర్ష తరువాత బౌన్సర్ ఎవరిమీద పడుతుందో మరి? శ్రీరెడ్డి దగ్గర సినిమా జనాల బాగోతాలు చాలా వున్నాయని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.