Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీమంతుడి దత్తతకు బ్రహ్మోత్సవం

శ్రీమంతుడి దత్తతకు బ్రహ్మోత్సవం

మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు తీరిక చిక్కింది.. ఎప్పుడో రాజకుమారుడు సినిమా టైమ్ లో వెళ్లారు తాతయ్య నానమ్మల ఊరికి.. మళ్లీ ఇదిగో ఇన్నాళ్లకు బ్రహ్మోత్సవం టైమ్ వచ్చారు. శ్రీమంతుడు సినిమా ఊపులో దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అది కూడా బావ గల్లా జయదేవ్ కోరడంతో. కానీ కార్యాచరణ మాత్రం ఆలస్యమైంది. భార్య నమ్రత తదితరుల వెళ్లి పెద్దలతో మాట్లాడి వచ్చారు. మరి ఏం ప్లాన్ చేసారో, ఏం సాయం చేసారో తెలియదు. 

ఇప్పుడు మహేష్ వచ్చారు.. బ్రహ్మోత్సవం సినిమా మరో కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి ఎన్ని చేయాలో..ఎంత చేయాలో అంతా చేస్తున్నారు మహేష్ బాబు. అందులో భాగంగానే ఇప్పటికిప్పుడు ఆయన బుర్రిపాలెం వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఎలా వచ్చినా, ఎందుకు వచ్చినా బుర్రిపాలెంకు మహేష్ ఏం చేయబోతున్నారో, ఇప్పటికి ఏం చేసారో అన్నది మాత్రం స్పష్టత లేదు. 

బుర్రిపాలెం వచ్చి మహేష్ చేసింది ఏమిటి? వివిధ పథకాల కింద రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసారు. ఎవరి పథకాలు? ఎవరి రుణాలు? నూటికి నూరు శాతం అవి ప్రభుత్వ పథకాల కింద మంజూరైన రుణాలే అయి వుండాలి. పక్కన ఎంపీ, మహేష్ బావ అయిన జయదేవ్ వుండనే వున్నారు. అంటే ఒక విధంగా అది ప్రభుత్వ కార్యక్రమం.. మహేష్ చేతుల మీదుగా ఇప్పించారు. అంటే ప్రభుత్వ రుణాలను మహేష్ అందించారు.

అలాగే విజయవాడ ఆసుపత్రి మహేష్ పేరు మీద హెల్త్ కార్డులు ముద్రించి, ఆ గ్రామంలో వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఆ కార్డులను కూడా మహేష్ అందించారు. తాను విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. మరి ఆ మేరకు ఏం చేస్తారో? చేసారో? చేయబోతున్నారో మాత్రం చెప్పలేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, ప్రభుత్వం సొమ్ము మహేష్ అందిస్తే, అది దత్తత తీసుకున్నట్లు అయిపోతుందా? తన వంతు రూపాయా? లక్షా? కోటా? ఏం చేసారు అన్నది క్లియర్ గా చెబితే, మిగిలిన వారికి ఆదర్శంగా వుంటుంది. అంతే కానీ బావ పలుకుబడి, అధికారం వాడి హెల్డ్ కార్డులు, రుణాల పంపిణీ చేస్తే కాదు.

ఇదంతా చూస్తుంటే అర్జెంట్ గా బ్రహ్మోత్సవం పబ్లిసిటీ కోసం చేసినట్లుంది తప్ప వేరుకాదు. ఇదిలా వుంటే తెలంగాణలో దత్తత తీసుకన్న అమ్మమ్మ ఊరు కూడా వెళ్తామంటున్నారు. మరి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. మరి అక్కడ కూడా ప్రభుత్వం చెక్కులు మహేష్ ఎలా అందిస్తారో చూడాలి?

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. మహేష్ తన సినిమా పబ్లిసిటీకి పనికి వస్తుందని అనుకుంటే, పవన్ ఎలాగూ దూరం అవుతున్నాడు, పార్టీకి పనికివస్తుందని తెలుగుదేశం జనాలు హడావుడి చేయడం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?